NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

చిత్తశుద్దితో బయటకు వస్తా కరీంనగర్ చౌరస్తాలో చెప్పులు దెబ్బలు తినడానికి సిద్దమా అంటూ మంత్రి కేటిఆర్ సవాల్

తెలంగాణలో రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా నడుస్తొంది. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం పీక్స్ చేరుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి కేటిఆర్ ఘాటుగా స్పందించారు. బీజేపీ, బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేటిఆర్. సిరిసిల్లలో మంత్రి కేటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. “దేశంలో ఏమవుతుందో ఎవరికి తెలవదు.. దేశం మొత్తం ఒకటే కథ జరుగుతుంది కదా..!  రాజకీయంగా ఎదుర్కోలేని దమ్ము లేని దద్దమ్మలు ఏమి చేస్తున్నారో..! వారి వేట కుక్కల్లాంటి సంస్థలను మా మీద ఉసిగల్పుతున్నారు” అని వ్యాఖ్యానించారు. తాము ఎప్పుడో చెప్పాము, వీటన్నింటికీ రెడీగా ఉన్నాము, మోడీ ..బోడీ .. ఆయన ఈడీ రమ్మనమను, ఏమి చేసుకుంటారో చేసుకోమను, మాకేమీ ఫరకు పడదు..ఏమి చేసుకుంటారో చేసుకోమను అని పేర్కొన్నారు. ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు..పనికి మాలిన హౌలా గాళ్లు చేస్తారు ఆ పనులు..అటువంటివి మేము చేయము, దమ్మున్నోడు ఉంటే ప్రజలకు ఏమి చేస్తాడో చేయమను, ఈ పాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించారు.

Telangana Minister KTR Slams PM Modi
Telangana Minister KTR

 

డ్రగ్స్ టెస్ట్ కు ఒప్పుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటిఆర్ స్పందిస్తూ “నేను టెస్ట్ కి ఇస్తా.. మోడీ ని ఇవ్వమంటా..ఇంకోడిని ఇవ్వమంటా..ఏంది ఇది చిల్లర రాజకీయం, ఇదేమైనా రాజకీయమా..ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడరా సన్నాసి అంటే ..ఫాల్తు మాటలు, తెల్లారి లేస్తే మొరుగుడు విచత్ర జంతువులా విచిత్రమైన అరుపులు..వీళ్లేమైనా మనుషులా, ? నాయకులా..?  ఏమి డ్రగ్స్, ఏమి టెస్టు లు, నేను టెస్ట్ కు ఇస్తా, ఆ తర్వాత కొడతా పడతాడా..? నేను చిత్తసుద్దిగా బయటకు వస్తా..కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలు తింటాడా..? నాతోని అన్నోడు.. నా రక్తం తీస్తాడా..చర్మం తీస్తాడా ఏమి తీసుకువెల్తాడో తీసుకువెళ్లమను. నా బొచ్చు కావాలంటే బొచ్చు కూడా ఇస్తా..నేను బయటకు చిత్తసుద్దితో వచ్చిన తర్వాత కరీంనగర్ చౌరస్తా వద్ద ఆయన చెప్పుతో ఆయన కొట్టుకుంటాడా. ? దీనికి సిద్దమైతే చెప్పు ఇక్కడే ఉంటా, రమ్మనమను,

ఏ డాక్టర్ ను తీసుకువస్తాడో.. గుండుకొట్టే ఆయనను తీసుకువస్తాడో తీసుకురమ్మనమను. నా బొచ్చు ఇస్తా, నా రక్తం ఇస్తా, నా గోళ్లు ఇస్తా .. వాడి బొంద ఏమి కావాలంటే అది ఇస్తా.. అవసరమైతే నా కిడ్నీ ఇవ్వమన్నా ఇస్తా” అంటూ సవాల్ విసిరారు కేటిఆర్. వాడి పిండాకూడు ఏమి రాజకీయమయ్యా ఇది. వాడికి ఏమైనా తెలివి ఉందా.. మనిషేనా..? పశువా..? కరీంనగర్ కు ఏమి చేశావురా భయ్ అంటే చెప్పే మొహం లేదు. పిచ్చి అరుపులు, గావు కేకలు, పెడబొబ్బలు ..హౌలా మాటలు , కరీంనగర్ కు ఏమి చేసాడో చెప్పమను. ఏందిరా బాయ్ అంటే హిందూ అంటడు. టెంపుల్ కు ఏమైనా నాలుగు పైసలు తెచ్చాడా అంటే అదీ లేదు. కొండగట్టు అంజన్నకు నాలుగు పైసలు తెచ్చావా.. ? వేములవాడకు తెచ్చావా.. ? దేనికి తెచ్చావో చెప్పు అని ప్రశ్నించారు.

ఉదయం కిడ్నాప్ .. మధ్యాహ్నం పెళ్లి .. తండ్రికి షాక్ ఇచ్చిన కుమార్తె

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N