“అరా మస్తాన్” సర్వే ఫేక్ సీక్రెట్ ! పక్కా ప్లానింగ్ తో మైండ్ గేమ్ ఇదిగో ఫ్రూఫ్స్..!

Share

తెలంగాణ రాజకీయాలు బాగా వేడెక్కిపోయాయి. ఎందుకంటే.. 2023 నవంబర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. కానీ ఆరు నెలలో 8 నెలలో ముందస్తు ఎన్నికలకు కేసిఆర్ సిద్దమైతే రెండు మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. తెలంగాణ పోలింగ్ 2023 మార్చి. ఏప్రిల్ లో జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. రాజకీయ పరిశీలకుల అంచనాల ప్రకారం ఏపి, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల ఎన్నికలు ఒకే సారి లేదా వారం రోజుల అటు ఇటుగా జరుగుతాయని భావిస్తున్నారు. తాజాగా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఆరా మస్తాన్ సర్వే రిలీజ్ అయ్యింది. టీఆర్ఎస్ కు 38 శాతం, బీజేపీకి 30 శాతం, కాంగ్రెస్ పార్టీకి 23 శాతం ఓటింగ్ అంటూ ఆ సర్వే రిపోర్టు ఇచ్చింది. అయితే ఈ సర్వే పూర్తిగా ఫేక్, వాస్తవం కాదు. ఈ సర్వే ఎందుకు ఫేక్..? స్పష్టమైన రీజన్ ఏమిటంటే..!

 

తెలంగాణలో బీజేపీకి 30 శాతం ఓటింగ్, రెండో ప్లేస్ అంటూ ఈ సర్వే ఇచ్చింది. ఈ సర్వే ఫేక్ అనేందుకు ఇవీ ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఆరా మస్తాన్ .. బీజేపీకి అనుకూలం. ఆయన బీజేపీకి వ్యూహకర్తగా పని చేస్తున్నారు. ఇది కాదనలేని సత్యం. అతను బీజేపీకి పని చేస్తున్నందున బీజేపీకి ఓటింగ్ బాగా పెరిగిందనే చూపిస్తారు. అసలు తెలంగాణలో బీజేపీ లక్ష్యం టీఆర్ఎస్ ను ఓడించాలి. అధికారంలోకి రావాలి. ఈ పరిస్థితుల్లో బీజేపీకి 35 , 37 శాతం ఓటింగ్ టీఆర్ఎస్ కంటే ఎక్కువ అని చెబితే ఎవరూ నమ్మరు అందుకే జనం నమ్మాలి, కాంగ్రెస్ కు ఏమి లేదు అని చూపించాలి. వాస్తవానికి తెలంగాణలో టీఆర్ఎస్ ఉన్నంత బలంగా బీజేపీ, కాంగ్రెస్ రెండు లేవు. టీఆర్ఎస్ కు ప్లస్ ఏమిటంటే..?  ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ రెండు పార్టీలు చీలుస్తాయి. బీజేపీకి ఇది చాలా ఇబ్బందికరం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి మాత్రమే పడాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు పడకూడదు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అనే విధంగా ప్రొజెక్టు చేసే ప్రయత్నమే ఈ సర్వే నివేదిక. కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు తగ్గిపోయింది అని జనాలను నమ్మించడంతో పాటు బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది అని నమ్మిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి పడే అవకాశం ఉంది.

 

ఎలక్షన్ సీజన్ ప్రారంభం అయినప్పటి నుండి సర్వేలపై జనాలకు ఆసక్తి ఉంటుంది. ఎలక్షన్ సర్వేలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. ఏ సర్వే జనాల్లోకి వెళ్లినా దానిపై ప్రజల్లో చర్చ జరుగుతుంది. అది తప్పుడు సర్వే అయినప్పటికీ జనాలు చర్చించుకుంటారు. ఆరా మస్తాన్ సర్వే నిజం అయినా ఫేక్ అయినా జనాలు దానిపై మాట్లాడుకుంటారు. దీన్ని బ్లైండ్ గా నమ్మే వాళ్లు టీఆర్ఎస్ తరువాత బీజేపీనే ఉంది అని అనుకుంటారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ప్రొజెక్టు చేయడానికి ఆ స్ట్రాటజీతో  సర్వే రిలీజ్ చేశారు. ఈ సర్వే ఉద్దేశం టీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు కాదు కాంగ్రెస్ కు నష్టం చేకూర్చేందుకే అన్నది వాస్తవం. ఇది స్టేజ్ నెంబర్ ఒన్. తరువాత ఆరు ఏడు నెల తరువాత ఆరా మస్తాన్ తరుపునో వేరే పేరుతో మరో సర్వే రిలీజ్ చేస్తారు. ఆ సర్వే రిపోర్టులో టీఆర్ఎస్ ఓటింగ్ తగ్గిపోయింది. బీజేపీకి ఓటింగ్ పెరిగింది, రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని రిపోర్టు ఇస్తారు. ఇదంతా మైండ్ గేమ్ పాలిటిక్స్ మాత్రమే కానీ క్షేత్ర స్థాయి పరిశీలనతో చేసిన వాస్తవిక సర్వే రిపోర్టు కాదు అనేది సుస్పష్టం.

టీడీపీ, వైసీపీ సామాజిక (రాజకీయ) న్యాయం ఇదే..! సంగ్మా పోటీ చేసినప్పుడు గుర్తుకు రాని సామాజిక న్యాయం..!!


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

29 mins ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

1 hour ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

3 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

4 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

4 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

5 hours ago