NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

TS Assembly Polls: కామారెడ్డి లో పోటీకి సిద్ధం, దమ్ముంటే కొడంగల్ లో నువ్వు పోటీ చెయ్…తగ్గేదే లేదు, కెసిఆర్ ఓటమి కాయం అంటున్న రేవంత్ రెడ్డి!

TS Assembly Polls: Revanth Reddy Challenges CM KCR to Contest Elections From Kodangal Constituency
Share

TS Assembly Polls: బిఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గజ్వెల్ తో పాటు కామ రెడ్డి లో కూడా పోటీ కి దిగుతున్న నేపధ్యం లో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గము ఇపుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇక్కడి రాజకీయం చాలా ఆసక్తి కరం గా మారింది. కేసీఆర్ లాగానే కొందరు బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు కూడా రెండేసి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా తమ నియోజకవర్గాలతో పాటు వేరే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.

TS Assembly Polls: Revanth Reddy Challenges CM KCR to Contest Elections From Kodangal Constituencyకామారెడ్డి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మొదట షబ్బీర్ అలీ పోటీ చేస్తారని అనుకున్నారు. ఇపుడు కామారెడ్డి పర్యటన లో ఉన్న తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే తాను గాని, భట్టి విక్రమార్క గానీ కామారెడ్డి నుండి కేసీఆర్ పై పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్ ను కేటీఆర్ ను ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు. కేసీఆర్ ను కొడంగల్ నుండి పోటీ చేయమని సవాలు విసిరామని కూడా రేవంత్ ఈ సందర్భంగా చెప్పారు. ఈసారి అన్ని పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నట్లుగా చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు బలం ఉంది.

Revanth Reddy: ఆ అధికారులను బదిలీ చేయాల్సి చేయాల్సిందే .. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

ముఖ్యమంత్రి కామారెడ్డి బరిలోకి దిగడంతో మిగిలిన అన్ని పార్టీల నాయకులు కామారెడ్డి నుండి వారి బలమైన అభ్యర్థి ని దింపాలని చూస్తున్నారు. ధర్మపురి అర్వింద్ లేదా విజయశాంతిలలో ఒకరు కామారెడ్డిలో సీఎంను ఎదుర్కొంటారని బీజేపీ నేతలు తొలుత భావించారు. కానీ బీజేపీ పార్టీ అధిష్టానం మాత్రం స్థానిక నేత వెంకట రమణారెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దింపింది.  ఈటల రాజేందర్ తన స్వగ్రామం హుజూరాబాద్ తో పాటు ఈసారి పోటీ చేయనున్న గజ్వేల్ లోనూ రావును టార్గెట్ చేశారు. కాంగ్రెస్ కూడా తన వ్యూహాన్ని మార్చుకుని కామారెడ్డిలో ముఖ్యమంత్రిపై రేవంత్ రెడ్డిని పోటీకి దింపాలని అలాగే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు గణనీయంగా ఉన్నకారణం గా షబ్బీర్ అలీని నిజామాబాద్ నుంచి బరిలోకి దింపే అవకాశం ఉంది. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వం ఖాయమనే వార్తలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల నుంచి రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీలను బరిలోకి దింపితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ విజయావకాశాలు పెరుగుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ‘డెక్కన్ క్రానికల్’తో అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్, కామారెడ్డి రెండింటిలోనూ పోటీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం వల్ల కేసీఆర్ ఓటమిని ముందే అంగీకరిస్తున్నారని చెప్పారు. నిబద్ధత కలిగిన నాయకుడు షబ్బీర్ అలీని లక్ష్యంగా చేసుకుని ఆయన్ని ఓడించాలని కెసిఆర్ ప్రయత్నమని టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి ఆరోపించారు.

 


Share

Related posts

విజయ్ దేవరకొండ ‘సీక్రేట్ ఎఫైర్స్’ అన్ని బయటపెట్టేసిన సమంత!

Teja

గన్ మిస్ ఫైర్ .. కానిస్టేబుల్ మృతి.. ఎక్కడంటే..?

somaraju sharma

కరివేపాకులా…… భారీ డైలాగ్ తో పవన్ కళ్యాణ్ పరువు తీసేసిన కే ఏ పాల్..!!

sekhar