Devatha Serial: ఆదిత్యను దేవి వాళ్ళ స్కూల్ లో ఫాదర్స్ డే ఫంక్షన్ కి పిలుస్తారు.. రుక్మిణీ కంగారుగా కనిపించడంతో ఆదిత్యా రుక్మిణీ దగ్గరకు వెళతాడు.. మాధవ్ సార్ ఇదంతా కావాలని చేస్తున్నారు అని చెబుతుంది ఆదిత్య తో.. ఈ రోజు ఎలాగైనా దేవికి నేనే తన తండ్రినని నిజం చెప్పేస్తాను అని అంటాడు ఆదిత్య.. నువ్వు నాకు అడ్డు పడొద్దు అని కూడా అంటాడు.. రుక్మిణీ కూడా సరే అని అంటుంది..
స్కూల్ లో ఫాదర్స్ డే ఫంక్షన్ లో పిల్లలు ఒక్కొక్కరుగా స్పీచ్ చెబుతూ ఉంటారు.. ఇక దేవి వంతు రాగానే మా నాయన అంటే నాకు చాలా ఇష్టం.. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు.. ఒక్కసారి నాకు కనిపించు నాయనా అని అంటుండగా.. దేవి అని మాధవ్ పిలుస్తాడు.. ఆప్యాయంగా మాధవ్ ను హత్తుకుని స్టేజ్ పైకి తీసుకు వెళ్తుంది.. ఫాదర్స్ డే గిఫ్ట్ గా మా నాన్న కి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను అంటూ.. తను గీసిన వాళ్ళ నాన్న బొమ్మను గిఫ్ట్ గా ఇస్తుంది.. దేవి కి నా మీద ఎంత ప్రేమ ఉందో తను చూపించింది.. నేను కూడా తన మీద ఉన్న ప్రేమను చూపించాలి కదా.. అందుకే తన మీద ప్రేమతో చేతి మీద దేవి అని పచ్చ బొట్టు వేయించుకున్నాను అని చూపిస్తాడు.. దాంతో ఆదిత్య, రుక్మిణి ఇద్దరూ షాక్ అవుతారు..
పిల్లలు నా మీద ఎంత ప్రేమ చూపించడానికి కారణం రాథనే.. మాధవ్ రాథని, చిన్మయి ని స్టేజ్ మీదకు పిలిపించి ఇదే నా కుటుంబం.. పిల్లలే నా బలం.. అంటూ స్పీచ్ ఇస్తాడు.. మాధవ్ మాటలు విన్న ఆదిత్య షాక్ అవుతాడు..