జానకమ్మ రాధకి రేపు వరలక్ష్మీ వ్రతం కదా అందుకే ఇవన్నీ శుభ్రం చేస్తున్నాను అని చెబుతుంది.. నేను ఉండగా మీరు ఎందుకు ఈ పనులు చేస్తున్నారు అని రాదా అంటుంది.. రేపు మనం గుడిలోకి వెళ్లి పూజ చేసుకుందాము.. అందుకే నువ్వు ఘనంగా కనిపించాలని ఓ మంచి చీర తీసుకున్నాను అని జానకమ్మ రాధకు చీర తీసుకొచ్చి ఇస్తుంది.. ఆ చీర రాధ తీసుకుంటుందా లేదా అని మాతో ఒకవైపు నుంచి చూస్తూ ఉంటాడు.. వరలక్ష్మి వ్రతం అనేది ముత్తైదువులు అందరూ చేసుకోవాల్సిన పుణ్యమైన వ్రతం నేను కూడా చేసుకుంటాను.. కానీ మీరు తెచ్చిన చీరతో మాత్రం కాదు అని మాధవని చూస్తూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
దేవుడమ్మ ఆదిత్య కు తలంటి స్నానం పోస్తుంది.. ఆదిత్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మా.. అయినా నేను ఆడపిల్లను కాదు కదా అని అంటాడు.. నువ్వు ఎంత పెద్దవాడివైనా గాని నాకు చిన్న పిల్లాడివి అని దేవుడమ్మ ఆదిత్య కు తలంటి స్నానం చేయిస్తుంది.. ఆదిత్య వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి వరలక్ష్మి దేవి పూజ చేస్తారు.. ఆదిత్య ఆ అమ్మవారితో దేవి మనసులో ఉన్న బాధ అంతా చెబుతాడు.. నువ్వే మంచి దారిలో నడిపించాలని కోరుకుంటాను..
దేవి గుడికి రానని మొండికేస్తుంది.. రాధ మనసులో మాధవ్ ఇదంతా కావాలని చేస్తున్నారు అని అనుకుంటుంది.. రాధ జానకమ్మ తో కలిసి గుడికి వెళ్లి పూజ చేసుకుంటున్నారు.. అంతలో జానకమ్మ మీ చిన్న మనవరాలు దేవి గుడికి రాలేదేంటి అని అడుగుతారు.. ఏమైనా కారణం ఉందా అని నొక్కి నొక్కి అడుగుతుండగా రాధ ఆలోచనలో పడుతుంది..