తులసి వాళ్ళ ఇంటికి వచ్చినది అంకితతో పర్సనల్ గా వెళ్లి మాట్లాడుతాడు.. నేను నీకోసమే వచ్చాను.. నువ్వు నాతో మాట్లాడవా అంకిత అని అడుగుతాడు.. ఇన్ని రోజులు నువ్వు రాకుండా ఇప్పుడు వచ్చావు.. అంటే కేవలం ఆంటీ పిలిచిందని మాత్రమే వచ్చావు.. నీ అంతటికి నువ్వు రాలేదు అని అంటుంది అంకిత దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. అంకిత ఇప్పుడు చాలా బాధగా ఉంది.. కదరా అని ప్రేమ్ వచ్చి అభి తో అంటాడు ఒక వస్తువు మన చేతిలో నుంచి జారిపోతే మనం తీసుకోవడానికి ప్రయత్నిస్తాము.. కానీ ఆడవాళ్లు మాత్రం అలా తీసుకోవడానికి చాలా ఆలోచిస్తారు.. అని ప్రేమ్ ఇన్ డైరెక్ట్ గా శృతి తనను వదిలి వెళ్ళిపోయింది అనే బాధలో అంటాడు..
తులసి హనీ వాళ్ళింటికి వెళ్లి తనను రెడీ చేస్తుంది. ఇక సామ్రాట్ కోరిక మేరకు హనీకి డాన్స్ కూడా నేర్పిస్తుంది.. అలా పొరపాటున వెళ్లి సామ్రాట్ కు తగులుతుంది.. సామ్రాట్ తులసిని పట్టుకుంటాడు.. దీన్ని పెద్ద హైలెట్ చేయకుండా సామ్రాట్ ఫోన్ రావడంతో వెంటనే పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడుతాడు.. ఇక లాస్య నందుకి ఈ సీన్ ని హైలెట్ చేస్తూ.. తులసి పైన చాడీలు అన్ని చెబుతుంది నందు కి.. తులసి ఇంటికి వెళ్లిపోబోతుండగా.. రేపు హనీ కాంపిటీషన్ ఫంక్షన్ కూడా మీరు రావాలి అని సామ్రాట్ అడుగుతాడు.. సరే అని ఒప్పుకుంటుంది తులసి..
తులసి హనీ పాటిస్పేట్ చేస్తున్న కాంపిటీషన్ ఫంక్షన్కు వెళుతుంది హనీని రెడీ చేస్తుంది.. అంతలో లక్కీ తులసి వేనకమాలకు నుంచుని ఈ అల్లూరి సీతారామరాజు నుంచి మీరు తప్పించుకుంటున్నారా అని అంటాడు.. మీరు పోరాడాల్సింది నాతో కాదు నల్ల దొరలతో అని తులసి అంటుంది. ఇంతకు మీరు ఎవరు అని అడుగుతుంది. నన్నే గుర్తుపట్టలేదా అని గడ్డంను తీస్తాడు అని అడుగుతుంది.. నేను కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్నాను ఆంటీ నన్ను ఆశీర్వదించండి అని తులసి కళ్ళపై పడతాడు.. లక్కీ విజయోస్తు అని తులసి దీవిస్తుంది ఇదంతా చూస్తున్న సామ్రాట్ అయోమయంగా ఉంటుంది. అది గమనించిన వాళ్ళ బాబాయ్ తులసిని.. ఎవరమ్మా ఈ అబ్బాయి అని అడుగుతాడు.. అంతలో లాస్య నందు వచ్చి రేయ్ లక్కీ నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ గడ్డం తియ్యద్దు అని.. పెట్టడానికి చాలా కష్టమవుతుంది అని అంటుంది. హనీ వాళ్ళ టీచర్ ఏదో పని ఉంది అని బయటకు వెళ్తుంది వెంటనే వస్తానని చెబుతుంది. అంతలోపు హనీ వాళ్ళ టీచర్ లేదే అని తెలిస్తే డిస్టర్బ్ అవుతుందని సామ్రాట్ చెబుతాడు. హనీ డిస్టర్బ్ అవ్వకుండా తులసి మేనేజ్ చేస్తుంది. కానీ ఎంత టైం అయినా కూడా ఆ టీచర్ ఫంక్షన్ కు రాదు.. ఇక తులసి సామ్రాట్ కంగారు పడతారు మిగతా విశేషాలు తెలుసుకుందాం..