Karthika Deepam: బుల్లితెర బాహుబలిగా కార్తీకదీపం ని పిలుస్తారు.. ఈ సీరియల్ కి వచ్చిన టిఆర్పి రేటింగ్ స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రాదు అంటే అతిశయోక్తి కాదు. ఆ రేంజ్ లో కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. డాక్టర్ బాబు, వంటలక్క ఎంతగా ఫేమ్ సంపాదించుకున్నారో.. ఈ సీరియల్ విలక్షణ నటి మోనిత కూడా అంతే ఫేమ్ ను సంపాదించుకుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి మోనిత సీరియల్ లో కనిపించడం లేదని.. అసలు మోనిత కనిపించకపోవడం వెనుక అసలు కారణం ఏంటని ఆమె అభిమానులు ఆరా తీయగా శోభ శెట్టి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

మోనిత అలియాస్ శోభా శెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. కార్తీకదీపం సీరియల్ నుంచి తనను కావాలనే తప్పించారని షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఇప్పటివరకు చాలా సీరియల్స్ లో నటించాను. కానీ ఇంతలా నేను ఎప్పుడూ బాధపడలేదు అని శోభా అన్నారు. సీరియల్ మోనిత రీ ఎంట్రీ గా వచ్చి ఒక 5 నెలలు మాత్రమే పని చేశాను. నేను సీరియల్ తర్వాత షెడ్యూల్ కోసం రెడీ అయ్యి కూర్చున్నాను. నా పాత్ర సీరియల్ లో జైలుకు వెళ్లినట్లు పెట్టారు..
నేను జైలు నుంచి తిరిగి వెచ్చాక నా రీఎంట్రీ మళ్ళీ నేను ఎదురు చూస్తున్నా. అయితే నా పాత్రను తొలగించినట్టు చెప్పారు. నేను షాక్ అయ్యాను. కథ ప్రకారం నా పాత్రను సైడ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. నాకు నమ్మబుద్ది కాలేదు. కథలో మోనిత గురించి డాక్టర్ బాబుకి అన్ని విషయాలు తెలిసిపోయాయి కాబట్టి ఇప్పట్లో నా పాత్ర అవసరం లేదు. అందువలన మోనిత కి ఫ్రెండ్ అయిన చారుశీలని రంగంలోకి దింపారు. ఇప్పుడు కథ మరింత ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ నా ఎంట్రీ ఉంటుంది. అప్పుడు మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని శోభా శెట్టి వివరించారు.