Malli Nindu Jabili మే 23 ఎపిసోడ్: మల్లికి అన్యాయం జరిగే పరిస్థిథి వొస్తే నేను నా కుటుంబం తో పోరాడటానికి కూడా సిద్దమే సత్య అని అరవింద్ అనడంతో మొదలవుతుంది మల్లి నిండు జాబిలి ఈ రోజు మే 23 ఎపిసోడ్ E363. మల్లికి కలలో కూడా అన్యాయం జరగనివ్వను తన బాధ్యత నాది అని సత్యతో అరవింద్ అంటాడు, మల్లికి నేను ఎప్పుడు తోడుగా ఉంటాను నీకు ఇచ్చిన మాట తప్పను అని అరవింద్ అన్న మాటలకు మల్లి కన్నీరు పెడుతుంది. ఇన్నేళ్ల తరువాత నా తండ్రి ని చూసి నేను ఆనందం తో గంగలా పొంగలేక పోయాను బాపు అంటూ సత్య చేతులు పట్టుకుని ఏడుస్తుంది మల్లి. మల్లిని ఏడవొద్దు అని సత్య ఓదార్చే ప్రయత్నం చేస్తాడు, నువ్వే నా తండ్రి బాపు అని మల్లి ఇంకా ఏడుస్తుంది. కొంచెం సేపటి తరువాత అరవింద్ మల్లి చెయ్యి పట్టుకుని అక్కడనుండి ఇంటికి తీసుకువెళ్తాడు.

మనోవేదనలో మల్లి తండ్రి శరత్
తరువాత సీన్ లో మనం ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న శరత్ ని చూస్తాం. మల్లి గురించి సోచిస్తూ మనోవేదనలో ఉంటాడు…అరవింద్ మాలిని ఫంక్షనలో జరిగిన సంఘటన తలుచుకుని బాధ పడుతూ ఉంటాడు. ఒక పక్క మీరా మరో పక్క మల్లి ఆలోచనలు శరత్ ని ముంచి వేస్తాయి. ఇంతలో కాఫీ తాగమని శరత్ తల్లి అక్కడకి వస్తుంది ఆ తరువాత వసుంధర కూడా మనకు కనిపిస్తుంది.

Malli Nindu Jabili మే 23 ఎపిసోడ్: దేవుడు నీకు కొంచెం సహనం ఇస్తే బాగుండేది
మీ అబ్బాయి కి వచ్చిన తలనొప్పి కాఫీలు కాషాయాలు తాగితే పొయ్యేది కాదు అత్తయ్య అని వసుంధర చురకలు అంటిస్తుంది, దానికి బదులుగా అవునులే తలనొప్పి తెప్పించిన వాళ్ళు సామాన్యులు కాదు కదా అని శరత్ తల్లి సమాధానం ఇస్తుంది. తలవంపులు తెచ్చిన వారు మీ దృష్టిలో మంచి వారు దానిని వేలు ఎత్తి చూపించిన వారు చెడ్డవారా అని వసుంధర అడుగుతుంది. మీ కూతురు కాంచనమాల గారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది కదా ఇంకా ఆవిడగారికి ఈ ఇంటి రామాయణం తెలియదు తెలిసింది అంటే ఊరంతా దండారో వేస్తుంది, అప్పుడు పరువు పోయి అందరం కట్ట కట్టుకుని చావాలి అని అంటుంది వసుంధర. దేవుడు నీకు కొంచెం సహనం ఇస్తే బాగుండేది అన్ని చక్కబడేవి అని శరత్ తల్లి వసుంధర తో అంటుంది.

చుట్టూ మోసం చేసే మనుషులే
చుట్టూ మోసం చేసే మనుషులు ఉన్నారు అని దేవుడు నాకు తొందరపాటు గుణం ఇచ్చి చాలా మంచి పని చేసాడు అత్తయ్య అని వసుంధర అంటుంది. లేదంటే నేను నా కూతురు ఇంకా మాయలో మోసంలో బ్రతుకుతూ ఉండే వాళ్ళం. ఇలా మాట్లాడుతున్న వసుంధరను చూసి శరత్ కోపంతో ఉగిపోతాడు. నీకున్న ఆ తొందరపాటు రాత్రి ఫంక్షన్లో నీ చేత చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడించింది వసుంధర అని శరత్ అంటాడు. పెద్ద నిజాలు బయటపడేప్పుడు పెద్ద మాటలే వస్తాయి అంది అని వసుంధర తెలివిగా సమాధానం ఇస్తుంది.

మల్లి విషయంలో నువ్వు హద్దులు దాటావు
కూర్చున్న కుర్చీ లోంచి లేచి శరత్ వసుంధర కు వేలు చూపిస్తూ ఇలా అంటాడు ‘నువ్వు మల్లి విషయంలో హద్దులు ధాటి ప్రవర్తించావు’. కేవలం మల్లి విషయం లోనేనా లేదా దాని తల్లి విషయం లో కూడానా అని వసుంధర ఎడ్డెంగా అంటుంది. మాకు నరకం చూపించింది దాని తల్లి, ఆ సిగ్గులేని ఆడది ఏదో ఒకరోజున అందరి ముందుకు వస్తుంది అని నాకు తెలుసు, ఆ మీరా ఫంక్షన్ కి వస్తే ఎక్కడ నా పరువు పోతుందో అని రాకుండా ఉండడానికి ఒక ప్లాన్ చేశాను అని వసుంధర అనడం తో శరత్ మొఖం మాడిపోతుంది. ఆ తరువాత మీరాను బట్టల షాపులో దొంగతనం కేసు కింద పోలీసులతో అరెస్ట్ చేయించిన విషయం శరత్ కు చెప్పేస్తుంది వసుంధర.

మరి అంత చీప్ ప్రవర్తనా వసుంధర
నా పలుకుబడిని ఉపయోగించి మీరాను జైలుకు వెళ్లేలా చేసేదాన్ని కానీ అనుకున్నట్లు జరగలేదు అని వసుంధర అంటుంది. ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి మరీ అంత చీప్ గా ప్రవర్తించొద్దు వసుంధర అని శరత్ అంటాడు. దానికి బదులుగా వసుంధర ఇలా అంటుంది ‘చీప్ బ్రతుకులు వారివి దిగజారిన బ్రతుకులు వారివి, మీ ప్రియురాలిని ఇబ్బంది పెట్టాను అని ఎంత బాధ వొచ్చేసిందే మరి వాళ్ళ వల్ల నేను నా కూతురు ఎంత ఇబ్బంది పడ్డాం ఎప్పుడైనా ఆలోచించారా?’. నువ్వు చేసిన పని వలన మల్లి నన్ను తప్పుగా అర్ధం చేసుకుంటుంది అని శరత్ అంటాడు. తమరు అనవసరం అయిన సంబంధాలు గురించి వారి సంతానం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వారికీ మీ ఇంటి పేరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని వసుందర అంటుంది.
Malli Nindu Jabili మే 23 ఎపిసోడ్: అటు తిరిగి ఇటు తిరిగి మీరు బిజినెస్ దెగ్గరికె
శరత్ వసుంధర సీన్ తరువాత కథ అరవింద్ ఇంటికి మారుతుంది. అక్కడ కాంచనమాల అనుపమతో మాట్లాడుతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను నేను, ఇన్ని రోజులు ఎన్ని చీరలు అమ్మేదాన్ని ఎంత బిజినెస్ జరిగేది నాకు అని కాంచనమాల అనుపమ తో అంటుంది. మీరు అటు తిరిగి ఇటు తిరిగి మీ బిజినెస్ దెగ్గరికె వొస్తరు కాంచన గారు అంటూ అనుపమ మందహాసంతో అంటుంది.
ఇంతలో అత్తయ్య అంటూ మాలిని అక్కడకి వస్తుంది. మా వదినేమో గడుసు మా మాలిని ఏమో మెతక అని కాంచన అంటుంది. అత్తయ్య మల్లి పెళ్లి గురించి మాట్లాడదాం అని మీరాను పిలిచాం కదా మరి ఆవిడ రాలేదు ఏంటి అని అనుపమతో అంటుంది మాలిని.

ఎలా అయినా మల్లిని ఇరికించాలి
మీరా రాలేదు అని అత్తయ్య వాళ్ళు రిలాక్స్ అవ్వకూడదు ఎలా అయినా పెళ్లి అని చెప్పి మల్లిని ఇరికించాలి అని మనసులో అనుకుంటుంది మాలిని. ఏదో కారణం తో ఆగిపోయి ఉంటుంది ఈ సారి ఆవిడ ఫోన్ చేస్తే విషయం సూటిగా చెప్పేద్దాం అని పక్కనే ఉన్న రామకృష్ణ అంటాడు. ఆవిడ ఫోన్ చెయ్యక పోతే వదిలేస్తారా ఏంటి మనమే మరి కొంచెం ప్రయత్నిచాలి, మల్లికి మంచి జీవితం ఇవ్వాలి అని రామకృష్ణతో మాలిని అంటుంది.

ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాను కాబట్టి నేను ఒక విషయం అడుగుతాను చెప్పండి అని కాంచన అంటుంది. ఏంటండీ అది అని అనుపమ అడగడం తో ‘ఆ మల్లి విషయం లో ఎలాంటి రహస్యాలు లేవు కదా’ అని కాంచన అడుగుతుంది. అలాటిది ఎం లేదండి అయినా మీకు ఆలా ఎందుకు అనిపించింది అని అనుపమ అడుగుతుంది. దానికి బదులుగా ఆ మల్లిని చూస్తుంటే పనిమనిషికి ఎక్కువ ఇంటి కోడలికి తక్కువ అన్నట్లు అనిపిస్తుంది అని కాంచన అంటుంది. అమ్మ మాలిని నైట్ ఫంక్షన్ తరువాత మమ్మీ డాడీ వాళ్ళు చెప్పకుండా వెళ్లి పోయారు ఏంటి అని రామకృష్ణ అడుగుతాడు, ఆ తరువాత మాలిని వసుంధర ఇంటికి వెళ్తుంది, అక్కడ శరత్ కి మాలినికి మద్య కొంచెం సేపు మాటలు నడుస్తాయి ఆ తరువాత మల్లి అరవింద్ రూప మధ్యలో ఒక కీలక సన్నివేశం జరుగుతుంది. అసలు ఎం జరిగిందో తెలుసుకోవాలి అంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. తిరిగి రేపటి మల్లి నిండు జాబిలి ఎపిసోడ్ అప్డేట్ లో కలుద్దాం…