NewsOrbit
Telugu TV Serials

కార్తీకదీపం సీరియల్ కి మంచి రోజులు వచ్చాయ్…వంటలక్క మళ్ళీ వచ్చేస్తుందిగా…!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో చిన్న సౌర్య ఎంట్రీతో సీరియల్ కీలక మలుపు తిరిగిందనే చెప్పాలి. అదే సీన్ నేటి కథనంలో కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు 1428 ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.

హిమను గుడికి వెళ్ళడానికి రెడీ అవ్వమని సౌందర్య ఆర్డర్ వేసి వెళ్తుంది. హిమకు ఏమి చేయాలో అర్ధంకాక అలానే ఆలోచిస్తుంది.ఇంతలో ప్రేమ్ వస్తాడు. బావ ఈ పెళ్లి ఎలాయినా ఆపేయాలి అంటుంది. నన్ను పెళ్లి చేసుకుంటే ఈ పెళ్లి కచ్చితంగా ఆగుతుంది కదా? అని మనసులోనే చిలిపి ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. ఇంతలో హిమ‘ఏం మాట్లాడవేంటి బావా? నువ్వు ఏం చేయబోతున్నావో చెబితే నాకు కాస్త టెన్షన్ తగ్గుతుంది కదా?’ అంటుంది హిమ. దాంతో ప్రేమ్.. ‘హిమా నువ్వేం భయపడకు నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను చూసుకుంటాను అంటాడు.ఇంతలో సౌందర్య వచ్చి ‘హేయ్ హిమా ఇంకా రెడీ కాలేదా? గుడికి వెళ్లాలి’ అని కంగారుపెట్టడంతో రెడీ అవ్వడానికి వెళ్లిపోతుంది హిమ.

సౌర్యను పొగిడే పనిలో ఆనందరావు :

సీన్ కట్ చేస్తే సౌర్య కూడా ఎంచక్కా చీర కట్టుకుని రెడీ అవుతుంది. ఆనందరావు సౌర్యని చూసి ఈ చీరలో ఎంత బాగున్నావో తెలుసా అంటాడు.ఇవన్నీ మానేసి.. ఆ డ్రెస్‌లేంటీ.. చేతికి రుమాళ్లు చుట్టుకోవడం ఏంటీ తల్లీ’ అంటాడు ఆనందరావు నవ్వుతూ ‘తాతయ్యా నీకేం పనిలేదా? ఇలా రాయబారాలు చేయడటమేనాఅంటుంది సౌర్య విసుగ్గా అవును నీ జీవితంలోకి ఆటో ఎలా వచ్చింది సౌర్యా’ అంటాడు ఆనందరావు మాట మారుస్తూ. నీ ఆటో బయోగ్రఫీ చెప్పు మనవరాలా’ అంటాడు ఆనందరావు నవ్వుతూ..దాంతో సౌర్య గతంలోకి వెళ్తుంది. ఇంట్లోంచి పారిపోయిన కొన్ని రోజులకి సౌర్య రోడ్డు మీద దిగులుగా అన్నీ తలుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఎదురుగా వారణాసి కనిపిస్తాడు. వెంటనే సౌర్య ఏడుస్తూ వారణాసి దగ్గరకు వెళ్లి పట్టుకుని ఏడుస్తుంది. మళ్ళీ సౌందర్య గుర్తొచ్చి వారణాసి నిన్ను మా నాన్నమ్మ, తాతయ్యలు పంపిచారు కదా’ అంటుంది సౌర్య కోపంగా. దాంతో ‘సౌర్యమ్మా నన్ను ఎవ్వరూ పంపించలేదమ్మా’ అంటాడు వారణాసి.

దీప, కార్తీక్ ల శవాల కోసం హాస్పిటల్ లి వెళ్లిన వారణాసి, సౌర్య:

దీపక్కా డాక్టర్ బాబులకి అలా అయ్యిందని తెలిసి నేనే తిరువునంతపురంకి వచ్చాను అంటాడు. యాక్సిడెంట్ అయ్యింది అన్నారు. శవాలు కూడా అతీగతీ లేవు.. చివరి చూపులు కూడా లేకుండా అయ్యిందమ్మా.. ఇక్కడ ప్రతిరోజు ఆసుపత్రికి వెళ్తున్నాను.. శవాల గదులకు వచ్చిన శవాలను గుండె చేతిలో పట్టుకుని చూస్తున్నాను తల్లీ..’ అంటాడు వారణాసి. నేను ఇక్కడికి అమ్మా నాన్నలని వెతుక్కుంటూ వచ్చాను. నేను నీతో పాటు ఆసుపత్రికి వస్తాను’ అంటుంది.సరే అంటాడు వారణాసి. ‘వారణాసి నువ్వు ఇంకా ఆటో నడుపుతున్నావా’ అంటుంది సౌర్య. అవును అంటాడు వారణాసి. నాకు ఎప్పటికైనా నువ్వే ఆటో నేర్పించాలి.. నేను కూడా ఆటో నేర్చుకుంటాను’ అంటుంది సౌర్య. వద్దమ్మా అని. వారణాసి అంటే..నువ్వు నాకు ఆటో నేర్పిస్తున్నావ్ అంతే అంటుంది సౌర్య కోపంగా.నేను కలిశానని మా తాతయ్య నాన్నమ్మకు కూడా చెప్పొద్దు అంటుంది సౌర్య కోపంగా.

హాస్పిటల్లో దీపక్క :

ఇక వారణాసి, సౌర్యలు ఓ ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ ఉన్న గదిలోనే ఐసీయూలో ఎవరో ఒక మనిషి బెడ్ మీద పడుకున్నట్లు చూపిస్తారు. అది ఎవరో కాదు దీపే. ఆ గది పక్క నుంచే వారణాసి, సౌర్యలు మార్చురీ రూమ్‌కి వెళ్తారు. ఆ గది బయటే వినాయకుడి బొమ్మ ఉంటుంది. వెనక్కి తిరిగిన సౌర్య ఆ గది ముందు నిలబడి దేవుడికి మొక్కి మార్చురికి వెళ్తుంది. మార్చురీలో ఉన్న శవాలు దీప, కార్తీక్ కాకపోవడంతో సౌర్య ఏడుస్తూ ‘వారణాసీ మా అమ్మా నాన్న ఎక్కడో బతికే ఉంటారు కదా.. వీళ్లల్లో ఎవరు కాదు అంటే.. వాళ్లు ఎక్కడో ఉన్నట్లే కదా అంటూ ఏడుస్తుంది. అప్పుడు వారణాసి ‘అక్కా బావ ఎక్కడున్నారో ఆ దేవుడికే తెలియాలి’ అనుకుంటాడు మనసులో. అప్పుడే ఆ గదిలో ఉన్నది దీప అని మరో సారి ప్రోమోలో చూపిస్తారు. అలా సౌర్య తన కధ చెప్తుంది.

సౌర్యకు ఆటో అంటే ఎందుకు అంత ఇష్టం అంటే..?

నాకు ఆటో అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? అమ్మ వారణాసి ఆటోలో వెనుకే కూర్చునేది కదా.. ఆ ఆటో వెనుక అమ్మా త్వరగా రా అని స్టిక్కర్ కూడా అంటించానని తెలుసుకదా? నేను ఆటో నడుపుతుంటే.. వెనకాల మా అమ్మ కూర్చున్నట్లే ఉంటుంది తాతయ్యా.. అందుకే ఆటో అంటే ఇష్టం’ అని ఎమోషనల్ అవుతుంది సౌర్య. ఇదంతా విని ఆనందరావు దూరం జరగుతు ఉంటాడు. సౌర్య అనుమానంగా చూస్తూ ఏంటి తాతయ్య అలా దూరంగా వెళ్తున్నారు అనడంతో నువ్వు తిట్టను కొట్టను అంటే ఓ నిజం చెబుతాను అంటాడు ఆనందరావు. ‘ఏంటి తాతయ్యా అని. సౌర్య అంటే ఆ వారణాసిని నీ దగ్గరకు పంపించింది మేమేనమ్మా’అంటాడు ఆనందరావు. దాంతో సౌర్యకు కోపం వచ్చేస్తుంది. ‘అంటే అప్పటి నుంచే నన్ను మోసం చేయడం మొదలుపెట్టారా మీరు’అంటుంది ఆవేశంగా.

సౌర్యను కొట్టిన సౌందర్య:

సరిగ్గా అప్పుడే సౌర్య చెంప చెల్లుమంటుంది. తిరిగి చూస్తూ ఎదరుగా సౌందర్య ఉంటుంది. హిమ కూడా వస్తుంది అప్పటికే.ఏంటే నువ్వు.. మేము మోసం చేశావా? అసలు ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? అంటుంది సౌందర్య. ‘చిన్నపిల్లలం అని నువ్వే అంటున్నావ్ కదా నాన్నమ్మా.. అప్పుడే ఇలా ఓ చెంప దెబ్బ కొట్టి.. తీసుకొచ్చి ఉంటే మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను కలెక్టర్‌ని అయ్యోదాన్నికదా?’ అంటుంది సౌర్య ఎమోషనల్‌గా.. ‘సౌర్యా అమ్మకి ఇచ్చిన మాట నెరవేర్చలేదని నీకు ఎంత బాధగా ఉందో అదే అమ్మ, నాన్నలకు ఇచ్చిన మాట నేను నెరవేర్చలేదని నేను కూడా అంతకన్నా ఎక్కువ బాధ పడుతున్న అంటుంది.ఆపు నీ కట్టుకథలు అంటుంది సౌర్య.ఇలా ఇద్దరు మాట్లాడుకోవడం చూసి. సౌందర్యకు కోపం వచ్చి నోరుమూసుకుని పదండి.. గుడికి వెళ్లాలి అని ఆర్డర్ వేస్తుంది వస్తూ వస్తూ.. మీ అమ్మా నాన్నలకు దన్నం పెట్టుకుని రండి’ అంటూ అరుస్తుంది సౌందర్య.
దాంతో సౌర్య, హిమలు ఒకరి తర్వాత ఒకరు కిందకు వచ్చి.. దీప, కార్తీక్‌ల ఫొటోలకు దన్నం పెట్టుకుంటారు.

సీరియల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్న దీప,కార్తీక్ :

ఈ ఫొటోలకు దండలు ఉండాలి కదా ఎవరు తీసేశారు’ అంటుంది సౌందర్య. ‘అవును నేను గమనించాలేదు.. ఎవరు తీసేశారో మరి’ అంటాడు ఆనందరావు. ఇంతలో సౌందర్యకు స్వప్న కాల్ చేయడంతో.. ‘హా బయలుదేరాం స్వప్నా వస్తున్నాం’ అంటుంది సౌందర్య.ఇక నిరుపమ్.. హిమ ఆలోచనలు గురించి ఆలోచిస్తుంటే.. ప్రేమ్ అటుగా వచ్చి వీడికి కనిపిస్తే మళ్ళీ నా గురించి అడుగుతాడు అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లబోతాడు. ఇంతలో నిరుపమ్ ప్రేమ్‌ని చూసేస్తాడు. రేయ్ ఆగరా.. ఏం అయ్యింది? వెళ్లిపోతున్నావ్ అంటే.. మూడ్ బాలేదు అంటాడు ప్రేమ్. ఇక కమింగ్ అప్‌లో.. వంటలక్క కోమాలోంచి బయటికి వచ్చిన సీన్ చూపించడంతో సీరియల్ మరింత ఆసక్తిగా మారిందనే చెప్పాలి.

Related posts

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella