ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అందగత్తెలకు కొదవ లేదు. ఆడ పిల్లలు ఉంటే ఇంటికి అందం అందులోనూ అందమైన ఆడపిల్లలు ఉంటే ఆ కళ వేరు. అలాంటి అందమైన ఆడపిల్లల సమాహారంతో ఈ సీజన్ బిగ్ బాస్ కళకళలాడుతోంది. సుజాత, లాస్య లా సంప్రదాయ దుస్తులు వేసే వారి దగ్గర నుండి హారిక, దివి లాగా హాట్ హా దుస్తులు ధరించే వారి వరకూ అందరూ ప్రేక్షకులను ఏదో ఒక రీతిలో అలరిస్తూనే ఉన్నారు.
అయితే వీరందరిది ఒక ఎత్తు అయితే అరియానా గ్లోరీ ది మరొక ఎత్తు. తను ఇంట్లోకి వచ్చి రావడంతోనే బోల్డ్ ఎంట్రీ ఇచ్చినా అరియానా గ్లోరీ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి వచ్చిన వెంటనే అందరి తో గొడవ వేసుకుంది. అప్పుడు బాగా నెగిటివిటీ మూటగట్టుకుంది. ఈ అమ్మాయి మూడు వారాల కంటే ఎక్కువ ఉండదు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే షో జరిగే కొద్దీ తన లోని పరిపక్వత బయట పడుతూ వచ్చింది.
దేవీ నాగవల్లి తో టైటిల్ గురించి మాట్లాడినప్పుడు కానీ ఏదైనా వాగ్వాదం జరుగుతున్నప్పుడు తన వాదనను స్పష్టంగా తెలియజేయడం వరకూ ఎప్పుడూ క్లియర్ గా ఉంటుంది. ఇక అరియానా గ్లోరీ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్జీవి తన తొడలపై కామెంట్ చేసిన తర్వాత బాగా పాపులర్ అయిన అరియానా గ్లోరీ తన ఇమేజ్ అలాగే కాపాడుకుంటుంది.
చందనాబ్రదర్స్ ఫ్యాషన్ డిజైనర్ కాస్ట్యూమ్స్ తో చేసిన ర్యాంప్ వాక్ లో తన పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. అవి పక్కన పెడితే తను వేసుకునే బట్టలు కూడా ఆమె ఒంపు సొంపులు ప్రేక్షకులకు కనివిందు చేస్తూ ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ పై అవగాహన పెంచేలా ఉన్నాయి. ఇలా అందరినీ అలరిస్తున్న అరియా పారితోషకం వివరాలుఇప్పుడు లీక్ కావడం విశేషం. ఆమెకు వారానికి లక్షన్నర రూపాయలకు పైనే నిర్వాహకులు ఇస్తున్నారట. అంతకంటే ఎక్కువైతే న్యాయం చేస్తుంది అరియానా గ్లోరీ.