NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Eluka Jemudu: ఎలుక జెముడు మొక్క గురించి విన్నారా..!? ఈ మొక్కతో ప్రపంచాన్ని వణికించే ఈ వ్యాధికి చెక్..!!

Eluka Jemudu: ప్రకృతి లో ఎన్నో మొక్కలు వాటి లో ఎన్నో ఔషధ గుణాలు.. ఇప్పుడు మనం చెప్పబోయే మొక్కను అక్కడక్కడా చూస్తూనే ఉంటాము.. ఇది పల్లెటూళ్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.. అదే ఎలుక జముడు, ఎలుక చెవి ఆకు చెట్టు..!! ఈ ఎలుక చెవి ఆకు నేల మీద పాకుతూ అల్లుకుంటుంది.. అయితే ఈ ఎలుక చెవి ఆకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..!! అయితే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..!!

Ayurvedic Health benefits of Eluka Jemudu: plant
Ayurvedic Health benefits of Eluka Jemudu plant

 

Eluka Jemudu: ఎలుక జముడు మొక్క తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!!

నులిపురుగుల సమస్య తో బాధపడుతున్న వారు బియ్యప్పిండిలో, ఎలుక చెవి ఆకు రసాన్ని, సైంధవ లవణాన్ని, విడంగాలను చేర్చి రొట్టెల చేసుకుని నల్ల బొగ్గులు కాల్చుకొని ఆ రొట్టెలను తింటే కడుపులో నులి పురుగులు పోతాయి. కడుపులో నొప్పి తగ్గిపోతాయి. గర్భం నిలబడటానికి ఎలుక చెవి రసాన్ని చెరుకు రసంతో కలిపి తాగితే గర్భస్రావం జరగదు. గర్భం నిలబడుతుంది. కంటి సమస్యలు ఉన్నవారు ఈ ఆకులను కూర వండుకుని తింటే నేత్ర సమస్యలు తగ్గిపోతాయి.

Ayurvedic Health benefits of Eluka Jemudu: plant
Ayurvedic Health benefits of Eluka Jemudu plant

ఎలుక కొరికితే ఈ ఆకు రసాన్ని ఒక చెంచా తాగాలి. అలాగే ఎలుక కొరికిన చోట ఈ ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేస్తే ఎలుక కాటు త్వరగా తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని, దో ప్రాస రసంతో తీసుకుంటే మూత్ర సమస్యలు తగ్గిపోతాయి. ఎలుక చెవి ఆకు రసంతో, భావంచలా చూర్ణం కలిపి నెయ్యి తో కలిపి తీసుకుంటే చర్మ రోగాలు తగ్గిపోతాయి. ఈ ఆకుల రసాన్ని గోమూత్రం లో కలిపి తాగినా కూడా చర్మ సంబంధిత సమస్యలు రావు.

Ayurvedic Health benefits of Eluka Jemudu: plant
Ayurvedic Health benefits of Eluka Jemudu plant

 

ఈ మొక్క మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ సి ఉంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఎలక జముడు మొక్క క్యాన్సర్ ను నివారించడం లో కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. ఎలక జముడు మొక్క మూత్రంలో మంట, మూత్రం సరిగా రాకపోవడం, అన్ని రకాల మూత్ర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. కిడ్నీ లో రాళ్లను కరిగించడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి, పార్శ్వనొప్పి తగ్గించడానికి దోహదపడుతుంది.

Ayurvedic Health benefits of Eluka Jemudu: plant
Ayurvedic Health benefits of Eluka Jemudu plant

Eluka Jemudu: ఎలుక జముడు ఆకుల కషాయం తో క్యాన్సర్ కు చెక్..!!

ఎలుక జముడు ఆకులను సేకరించి శుభ్రపరుచుకోవాలి. ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో ఈ ఆకులను వేసి ఐదు మిరియాలను వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీరు మరిగాక వడపోసుకోవాలి ఇలా తయారుచేసుకున్న ఈ కషాయాన్ని మూడు నెలల వ్యవధిలో 15 రోజులు తాగాలి. మరల మూడు నెలల తరువాత మరో 15 రోజులు తాగాలి. అంటే మూడు నెలల్లో 15 రోజులు మాత్రమే ఈ కషాయాన్ని తాగాలి. ఈ కషాయం తాగడం వలన జ్వరం, దగ్గు, జలుబు తగ్గుతుంది. ఈ కషాయం తాగడం వలన అనేక రకాల వైరల్ ఫీవర్ ను తగ్గిస్తుంది.

ఈ కషాయం తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయి. క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. ఒకవేళ క్యాన్సర్ తో బాధపడుతుంటే ఈ కషాయం ఇప్పుడు చెప్పుకునే విధంగా తాగితే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి.

 

author avatar
bharani jella

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju