సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ చాలా సాఫీగా సాగుతోంది. వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు బాబు. అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని రాజమౌళి స్వయంగా చెప్పడం తో మహేష్ అభిమానులు ఒక వారం రోజులు పెద్ద పండగ చేసుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తర్వాత తాను మహేష్ తో సినిమా చేస్తానని…. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్ నారాయణ నిర్మిస్తారని రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో బాబు అభిమానుల ఆనందాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ఇక అదే వరుసలో మొన్ననే భారీగా ట్రెండ్ కూడా చేసి మహేష్ అభిమానులు ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం కూడా తెలిసిందే.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రాజమౌళి ఆ సినిమాను ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పలేని పరిస్థితి. అంతా తేడాగా ఉందని స్వయంగా అతనే ప్రకటించాడు కూడా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 2021 చివర్లో కూడా ఆ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనపడటం లేదు. ఇక అది విడుదలైన తర్వాత 2022 చివరాఖరికి మహేష్-రాజమౌళి చిత్రం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎంత లేదన్నా కనీసం ఏడాది పాటు ఆ సినిమా షూటింగ్ ఉంటుంది. కాబట్టి 2023 లోనో…. లేదా 2024 మొదట్లో మహేష్ రాజమౌళి సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కూడా అనుకున్నవి అనుకున్నట్టు జరిగితేనే…!
ప్రస్తుతం మహేష్ సర్కార్ వారి పాట సినిమా చేస్తున్నాడు. తర్వాత రాజమౌళి ప్రాజెక్టు తప్ప దేనికి ఓకే చెప్పలేదు. ఎంత ఎక్కువ వేసుకున్న సంవత్సరం రోజుల కన్నా సర్కారు వారి పాట షూటింగ్ జరుపుకోదు. వచ్చే ఏడాది సమ్మర్ కి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. పరిస్థితులు అనుకూలించకపోయినా దాదాపు వచ్చే ఏడాది చివరికైనా అది విడుదల అయిపోతుంది. అంటే…. ఆ తర్వాత కనీసం ఒక సంవత్సరం పాటు మహేష్ ఏ ప్రాజెక్టుని ఓకే చేయకపోతే అభిమానులకు చాలా గ్యాప్ వస్తుం.ది ఈ లోపల ప్రొడక్షన్ లో తేడా వచ్చినా… మహేష్ మూద్ మారినా ప్రాజెక్టు పట్టాలు ఎక్కకపోవచ్చు. దానికీ అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఏం జరుగుతుందో అర్థం కాక మహేష్ అభిమానులంతా టెన్షన్ లో ఉన్నారు.