ఈ రోజు బిగ్ బాస్ ఇంటిలో ‘బిబి హోటల్’ టాస్క్ జరుగనుంది. ఇందులో భాగంగా హౌస్మేట్స్ లో కొంతమంది హోటల్ నడుపుతూ ఉంటారు. గంగవ్వ అమ్మగా…. అరియానా గ్లోరీ ఆమె కూతురు గా హోటల్ కు విచ్చేశారు. అలాగే గెస్ట్ జాబితాలో మెహబూబ్, సోహెల్ కూడా ఉంటారు. అమ్మరాజశేఖర్, అవినాష్ పంచ్ లు వేస్తూ ఉంటారు.
వాళ్ళ హోటల్ కి విచ్చేసిన వారికి మర్యాద చేయాల్సింది పోయి వారి పై సెటైర్లు వేసి వారిని ఉడికిస్తూ ఉన్నారు. ఇదే వరుసలో మెహబూబ్ ని అయితే చిన్న పిల్లోడిని చేసి అభిజిత్, కుమార్ సాయి ఆడుకున్నారు. అభిజిత్ చికెన్ పకోడి వేయడానికి ఒకటిన్నర గంట సమయం పడుతుంది అని మెహబూబ్ కి తెలిపాడు. దానికి మెహబూబ్ నేను ఒక అరగంట లో వేసి చూపిస్తాను అని అన్నాడు. దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కావాలంటే మీరే వచ్చి చికెన్ పకోడి వేసుకోవచ్చు అని అభిజిత్ పంచ్ పేల్చాడు. దానికి మెహబూబ్, సోహెల్ దగ్గర సమాధానం రాలేదు.
ఆ తర్వాత చెడు వాసన వస్తుందని కుమార్ సాయి రూమ్ స్ప్రే తీసుకుని వచ్చి కొడుతున్నాడు. అప్పుడే మెహబూబ్ అది బాత్ రూమ్ స్ప్రే లాగా ఉంది అని కామెంట్ చేశాడు. మీరు ఎక్కువగా బాత్రూం లో ఉంటారేమో అందుకే అలా అనిపిస్తుంది అని అన్నాడు. అప్పుడు మహబూబ్ ఏంటి ఇది పంచ్ ఆ అని అడిగితే…. దానికి కుమార్ సాయి స్ప్రే చేతిలో పెట్టి కాదు ఇది స్ప్రే అని అన్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా అఖిల్ అవినాష్ పైన చేయి చేసుకున్నట్లు ప్రోమో లో చూపించారు. వెంటనే బిగ్బాస్ అవినాష్ కు ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. అంతే హోటల్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. గొడవలు తగాదాలతో హౌస్ రచ్చ లేచింది.
Welcome to #BBHotel..Ikada miku manchi fun dorukutundi ? #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/chvBZjTPrm
— starmaa (@StarMaa) October 6, 2020
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!