నిన్న జరిగిన బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ ఈ సీజన్లోనే బెస్ట్ ఎపిసోడ్ అని టాక్ బయటకు వచ్చింది. దీని గురించి మీరు కూడా వినే ఉంటారు. నామినేషన్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య భారీగా గొడవలు జరిగాయి. అభిజిత్, అఖిల్, సోహెల్, మోనాల్ భారీ పంచాయతీ పెట్టుకున్నారు ఇక ఒకానొక దశలో మోనాల్ తన కంట్రోల్ చేసుకోలేక గట్టి గట్టిగా అరిచి ఏడ్చేసింది. బిగ్బాస్ నాలుగో సీజన్ కరెక్ట్ గా 30 రోజులు జరిగిన తర్వాత మరింత రసవత్తరంగా మారింది.
ఇందులో భాగంగా ముందుగా అఖిల్.. అభిజిత్, అమ్మ రాజశేఖర్ లను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా అఖిల్-అభి మధ్య గొడవ ప్రారంభమైంది. ఒకటి మోనాల్ గురించి కాగా మరొకటి వారి వ్యవహారశైలిపై నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్ లో ఒకరిని ఒకరు గట్టి గట్టిగా అరుచుకుంటూ ఉండగా ఇదే సమయంలో సుజాత, లాస్య లను మెహబూబ్ , నోయల్, అభిజిత్ లను గంగవ్వ, అఖిల్, అరియానా లను అమ్మ రాజశేఖర్, అఖిల్ మోనాల్ లను దేత్తడి హారిక, లాస్య, సోహెల్ లను దివి నామినేట్ చేశారు. చివరికి మోనాల్.. హారిక, అవినాష్ ని నామినేట్ చేసింది.
తర్వాత నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు అసలైన గొడవ స్టార్ట్ అయింది. మోనాల్ గురించే కాకుండా హారిక విషయంలో కూడా వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇక చివరిలో అభిజిత్, సోహెల్ కు మధ్య గొడవ జరిగింది చదువు గురించి వారిద్దరి మధ్య వాగ్వాదం రావడం గమనార్హం. అన్నింటికన్నా హైలెట్ చివరిలో సోహెల్ పూర్తి టెంపర్ తో మాట్లాడటం. ముఖ్యంగా అందరూ అఖిల్ పై లగ్జరీ బడ్జెట్ ను నాశనం చేసినందుకు ఫైర్ అయ్యారు. ఇక ఎప్పటిలాగే అభిజిత్ ఏదో మాట్లాడుతుంటే అఖిల్ అంతమంది నామినేట్ చేస్తుంటే ఉండబట్టలేక మోనాల్ పేరుని తీసుకొచ్చాడు.
అభిజిత్ అది మేము మేము చూసుకుంటాము తనతో నీకేంటి సంబంధం అని అంటే ఇది నేషనల్ టెలివిజన్ నా పేరు లాగకండి మీకు అసలు నా పరువు గురించి ఆలోచించి ఉద్దేశం ఏమైనా ఉందా అని గట్టి గట్టిగా వారిద్దరిని అరిచేసింది. ఇక ఈ గొడవలో అభిజిత్-అఖిల్-మోనాల్ మధ్య గొడవలో బాగా లాభపడింది అభి అని చెబుతున్నారు. అలాగే దివి కూడా సోహెల్ బెదిరిస్తే…. ఏం చేస్తావ్.. అని భయపడకుండా అతనికే ముచ్చెమటలు పెట్టిన తీరు కూడా బాగుంది కానీ మోత్తం ఊపు అభిజిత్ దే అని.. నిన్న ఒక్క రోజు ఓటింగ్ లో కూడా అతను హవా చూపిస్తున్నాడట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!