Kuthuhalamma: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ నేటి ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నేడు తెల్లవారుజామున తిరుపతిలోని తన నివాసంలో కన్నుమూశారు .

1949 జూన్ ఒకటో తేదీన ప్రకాశం జిల్లా కందుకూరులో గుమ్మడి కుటుంబం జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆ తర్వాత వైద్య వృత్తిలో కొనసాగారు 1979 నుండి 1981 వరకు డాక్టర్స్ సెల్ కన్వీనర్ గా పనిచేశారు. 1979లో కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేశారు. 1980 నుంచి 85 లో చిత్తూరు జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా ఆప్షన్స్ సభ్యురాలుగా సేవలందించారు.
మరోవైపు 1985లో వేపంజేరి నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుపు పెట్టారు. 2014లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరారు. కుతూహలమ్మ 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. రాజకీయాల్లో ఆమె వివిధ హోదాల్లో కొనసాగారు. 24 జులై 2007 నుండి 19 మే 2009 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా సేవలు అందించారు కుతూహలమ్మ మృతికి పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆమెతో అనుభవం ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.