Gold Medal: బంగారానికి మెరుగులు దిద్దే ఒక వంకతో కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి వచ్చి బంగారం ఎత్తుకు పోయారని మనం ఎన్నో సార్లు వినే ఉంటాము.. ఇప్పుడు అదే కథతో తెరకెక్కుతున్న సినిమా గోల్డ్ మెడల్.. ఉదయ్ కుమార్ ముంతా తన సినిమాను తానే డైరెక్ట్ చేసుకోవడం మరో విశేషం.. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు మేకర్స్

ఈ సినిమాలో ఉదయ్ కుమార్ ముంతా, దేవిశ్రీ, డాక్టర్ భవాని, ఎం రవి, రత్న, రుక్మిణి ప్రధానపాత్రలో కనిపించనున్నారు. యూకే క్రియేషన్స్ బ్యానర్ పై ఎం నవీన్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రాజ్ సంగీతం అందిస్తున్నారు. ఉదయ్ కుమార్ ఈ సినిమాలో బంగారం మెరుగులు దిద్దే వ్యక్తి గా కనిపించనున్నాడు. ఈ టీజర్ లో ఉదయ్ కుమార్ నటన ఆసక్తిని రేకెత్తిస్తోంది…
Pawan Kalyan: పర్చూరు సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు