Rajamouli: ప్రపంచ సినిమా రంగం ఒకానొక సమయంలో భారతీయ చలన చిత్ర రంగం గురించి మాట్లాడాల్సి వస్తే బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడేది. మన దేశం కాక ప్రపంచ సినీ ప్రేమికులు ఎక్కువగా బాలీవుడ్ గురించి మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఎప్పుడైతే రాజమౌళి “బాహుబలి” తీయటం జరిగిందో…సీన్ రివర్స్ అయింది. సినిమా భారీ బ్లాక్ బస్టర్ కావడంతో..అప్పటి నుండి రాజమౌళి గురించి మాట్లాడుకునే పరిస్థితి నెలకొంది. దర్శకుడిగా “స్టూడెంట్ నెంబర్ వన్” నుండి “బాహుబలి” వరకు… రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ సినిమాలే.
ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ కూడా పడని డైరెక్టర్ రాజమౌళి. ఆ రీతిలో సక్సెస్ఫుల్ గ్రాఫ్ మెయింటైన్ చేస్తున్న రాజమౌళి కథలు దాదాపు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించినవి. “బాహుబలి” కథ కూడా విజయేంద్రప్రసాద్ కలం నుండి వచ్చినదే. అటువంటి విజయేంద్రప్రసాద్ కి ఇష్టమైన డైరెక్టర్ ఎవరో ఇటీవల ఆలీతో షోలో… మనసులో మాట బయట పెట్టారు.
Read More: Puri jagannadh : పూరి జగన్నాధ్ అంతే..ఎవరితో పోల్చుకోలేము..!
ఆలీ రాజమౌళి కాకుండా మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అని రాజమౌళి తండ్రిని ప్రశ్నించడం జరిగింది. దీనికి ఏమాత్రం కరకు బెరుకు లేకుండా విజయేంద్రప్రసాద్… పూరి జగన్నాథ్ అని బదులిచ్చారు. అంతేకాకుండా తన ఫోన్ లో వాల్‌పేపర్ పై కూడా ఆయన ఫోటో పెట్టు కున్నారు. పోరి అంటే తనకు ఎంతగానో అసూయా అని… నా శత్రువు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉంటారో నాకు నిద్ర పట్టనివాడు అంటూ.. పూరి జగన్నాథ్ పై తనకున్న అభిమానాన్ని విజయేంద్రప్రసాద్ బయటపెట్టారు.