ట్రెండింగ్ న్యూస్ సినిమా

Akash Puri: ఆకట్టుకుంటున్న ఆకాష్ పూరి “చోర్ బజార్” మోషన్ పోస్టర్..!!

Share

Akash Puri: చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆకాష్ పూరి అందరికీ సుపరిచితమే.. మెహబూబ్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.. ఆకాష్ నటించిన రొమాంటిక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి పుట్టినరోజు నేడు..!! ఈ సందర్భంగా ఆకాష్ నటిస్తున్న “చోర్ బజార్” సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్..!! బచ్చన్ సాబ్ ఆగాయా అనేది ట్యాగ్ లైన్..!!

HBD Akash Puri: special Chor Bazar Motion poster out
HBD Akash Puri: special Chor Bazar Motion poster out

టైటిల్ కి తగ్గట్టే ఆకాష్ ఫస్ట్ లుక్ మాస్ గా ఉంది.. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాలో ఆకాష్ సరసన గెహన సిప్పి నటిస్తోంది. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఐవి ప్రొడక్షన్స్ పతాకంపై, వి ఎస్ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. సురేష్ బొబ్బిలి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ లో ఆకాష్ పూరి పవర్ ఫుల్ గా ఉన్నాడు. సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ యంగ్ హీరో కచ్చితంగా ఈ సినిమాతో హిట్ అందుకుంటాడేమో చూడాలి..


Share

Related posts

బాబుగారికి తెలీకుండా ఆయన వెనకే ఆయనమీదే కొంపమునిగే స్కెచ్ లు గీస్తున్నారు!!

CMR

డైనోసార్ గుడ్లును ఎప్పుడైన చూశారా ?

Teja

Onion: అడిగి మరీ ఉల్లిపాయ తింటున్నారా..!? అయితే ఈ వ్యాధి వస్తుందట..!!

bharani jella