KCR: మోడీ కంటే కేసీఆర్ తోపు అంటున్న కోదండ‌రాం

Share

KCR: దేశంలో ఫోన్ ట్యాపింగ్ క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు కొన‌సాగుతున్నాయి. అయితే, తెలంగాణ జ‌న స‌మితి నేత కోదండ‌రాం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కొన్నేళ్లుగా ఫోన్ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడుతోందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఐదారేళ్ల కిందట ఒకసారి కలిసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ కోసం రాష్ట్ర పోలీసులు ఉపయోగిస్తున్న ఇజ్రాయెల్ టెక్నాలజీ గురించి కేసీఆర్ తమకు చెప్పారని గుర్తుచేశారు.

Read More: KCR: కేసీఆర్‌కు హుజురాబాద్ భ‌యం ప‌ట్టుకుంది.. . దానికి ఉదాహ‌రణ ఇదే!

కోదండ‌రాం ఏమంటున్నారంటే…

ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్‌‌ సర్కారు ఒక ఆకు ఎక్కువే చదివిందని కోదండ‌రాం ఆరోపించారు. “2015 లోనో, 2016 లోనో అనుకుంటా. ఫోన్లన్నీ ట్యాప్ చేస్తరయా.. మావోళ్లు ఎక్కడో ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌కెళ్లి ఏదో తెచ్చిండ్రట. మీరు ఎక్కడున్నరో గుర్తుపడ్తరట. మనం మాట్లాడితే వింటరట. అందుకే ఎక్కడబడితే అక్కడ.. ఏదిపడితే అది మాట్లాడొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలె” అని అప్పట్లోనే హెచ్చరించారని చెప్పారు. తాము ఏదైనా కార్యక్రమం చేయాలని ఫోన్‌‌‌‌‌‌‌‌లో అనుకున్నా తెల్లారే సరికి పోలీసులు ఇంటి ముందు ఉంటున్నారని, పత్రికా ప్రకటన ఇవ్వకున్నా పోలీసులకు తెలుస్తోందని కోదండ‌రాం అన్నారు.

Read More : KCR: హుజురాబాద్‌లో కేసీఆర్ స్కెచ్ పై ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వాళ్లు ఏమంటున్నారంటే…
పెగాసస్​ అంశం ప్రపంచాన్ని కుదిపేస్తుంటే.. దాన్ని తయారు చేసిన సంస్థ ఎన్​ఎస్​వో గ్రూప్​ మాత్రం అది సూపర్​ అంటూ వింత వాదన చేస్తోంది. తమ స్పైవేర్​ వల్ల ప్రపంచంలోని కోట్లాది మంది హాయిగా నిద్రపోతున్నారని కామెంట్​ చేసింది. ఇలాంటి టెక్నాలజీల వల్లే రోడ్ల మీద జనం భయం లేకుండా ధైర్యంగా తిరగగలుగుతున్నారని పేర్కొంది. తన క్లయింట్ల వద్ద ఉన్న సమాచారాన్ని తాము తీసుకోవట్లేదని స్పష్టం చేసింది. అందుకు పెగాసస్​కు థ్యాంక్స్​ చెప్పాలని పేర్కొంది. నిఘా, దర్యాప్తు సంస్థలు పెగాసస్​తో టెర్రరిజం, నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నాయని చెప్పింది. కట్టుదిట్టమైన ఎన్​క్రిప్షన్​ ఉన్న ఫోన్ల మాటున దాక్కున్న వాటన్నింటినీ పెగాసస్​ పటాపంచలు చేస్తోందని తెలిపింది. చీకటి సామ్రాజ్యంలోని అక్రమ వ్యవహారాలపై నిఘా వేసేందుకు ఎలాంటి సాధనాలు లేవని, ప్రపంచంలోని ఇతర సైబర్​ ఇంటెలిజెన్స్​ సంస్థలతో కలిసి ఎన్​ఎస్​వో ఆ టూల్స్​ను తయారు చేసిందని చెప్పుకొచ్చింది. భద్రమైన ప్రపంచం కోసం తాము పనిచేస్తున్నామని వివరించింది.


Share

Related posts

Big Breaking: వైసీపీ ఎమ్మెల్యే X అధికారులు..! మందు పంపిణీపై ఎవరి మాట వారిదే..!!

Yandamuri

Butterfly Asana: ఈ ఆసనం వేస్తే త్వరగా బరువు తగ్గుతారు..!! 

bharani jella

Kiss: ముద్దులో ఉండే మరికొన్ని రకాలు తెలుసుకుని వీటిని కూడా ట్రై చేయండి!!

siddhu