HBD Anchor Anasuya: బుల్లితెర యాంకర్ అనసూయ తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు.. జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. రంగమ్మత్తగా వెండితెరపై తన నటనతో తన ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకుంది.. అటు బుల్లితెరలోను ఇటు వెండితెర లో స్పెషల్ క్రేజ్ అందుకుంటోంది అనసూయ.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ భారీగా ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.. ఈరోజు జబర్దస్త్ బ్యూటీ అనసూయ పుట్టినరోజు..!! రంగమ్మత్త పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన సీడీపీలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.. సోషల్ మీడియాలో ఈ సీడీపిలు హల్ చల్ చేస్తున్నాయి..
సూపర్ హిట్ కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఓటీటీ లో విడుదలైన థాంక్యూ బ్రదర్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.. అనుకోకుండా ఎలివేటర్ లో ఇరుక్కుపోయిన రీచ్ యంగ్ మాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ మధ్య జరిగే కథే థాంక్యూ బ్రదర్..
ప్రస్తుతం అనసూయ థాంక్యూ బ్రదర్ సినిమా హిట్ ను ఆస్వాదిస్తోంది. ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా అప్ డేట్స్ వస్తాయేమో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!