NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hair Care: జుట్టు ఊడిపోయి బట్టతల అవుతుందని బాధపడుతున్నారా..ఈ చిట్కా వైద్యం ప్రయత్నించండి..

Hair Care: చాలా మంది ప్రస్తుతం బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. గతంలో వయసు మీద పడిన వారికి మాత్రమే వెంట్రుకలు ఊడిపోయి బట్టతల వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా యువకులు బట్టతల సమస్యతో సతమతమవుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, టెన్షన్, కాలుష్యం తదితర కారణాల వల్ల పాతికేళ్ల యువకులు కూడా బట్టతలతో ఇబ్బందులు పడుతున్నారు. తలపై వెంట్రుకలు లేక నలుగురిలో కలవలేక మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. అయితే ఈ సమస్య పురుషుల్లోనే కాదు మహిళలు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. పురుషుల కంటే మహిళలకు జుట్టు సౌందర్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అందంగా జడ వేసుకోవాలి, పువ్వులు పెట్టుకోవాలి అని భావిస్తుంటారు. యువతులు ప్రతి రోజు ఊడిపోతున్న జుట్టును చూసి ఆందోళన చెందుతున్నారు.

health tips for Hair loss
health tips for Hair loss

అయితే ఈ సమస్యపై జామ ఆకులు బాగా పని చేస్తాయి. జుట్టు ఊడకుండా కాపాడతాయి.  కేవలం జుట్టు రాలడాన్ని నివారించడమే కాక కొత్త జుట్టు పెరిగేందుకు కూడా జామ ఆకులు ఉపయోగపడతాయట. జుట్టు కుదుళ్లను బలంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతాయిట. జామలో విటమిన్ బీ 6 పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను బలంగా చేసేందుకు దోపదపడుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ఎలా వాడాలంటే..

ఒక గిన్నెలో నీళ్లు పోసి కొన్ని జామ ఆకులు వేసి బాగా మరగించాలి. దాదాపు 20 నిమిషాల పాటు ఆకులను ఉడకబెట్టాలి. ఆ నీళ్లు చల్లారి గోరువెచ్చగా మారిన తరువాత కొంచెం కొంచెంగా తీసుకుని తలపై భాగాన మర్ధన చేయాలి. జామ ఆకు నీటితో దాదాపు పది నిమిషాల పాటు తల మొత్తం బాగా రద్దుకోవాలి. ముఖ్యంగా కుదుళ్ల వద్ద మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండు గంటల పాటు అలాగే వదిలివేయాలి. రాత్రి పడుకునే ముందు ఇలా మర్ధన చేసుకుని తలకు టవల్ చట్టుకుని నిద్రపోవచ్చు. జుట్టు ఊడిపోతుందన్న భయంతో ఏవో షాంపులు, నూనెలు వాడే బదులుగా ఇలా ప్రయత్నించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju