MaheshBabu – Trivikram: మహేష్ సినిమాకు త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే..!!

Mahesh babu - Trivikram Movie: here is Name
Share

MaheshBabu – Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే.. మహేష్ కెరీర్ లో 28వ సినిమా తెరకెక్కనున్న ఈ సినిమా కు పార్ధు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.. మరోవైపు ఈ సినిమా కు సంబంధించి రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి.. తాజాగా ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..

MaheshBabu - Trivikram: movie demand high Remuneration
MaheshBabu – Trivikram: movie demand high Remuneration

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు క్లాసిక్ లు గా నిలిచాయి.. దీంతో మరో క్లాసిక్ సినిమా రానుందంటూ అభిమానులు అంటున్నారు.. 11 సంవత్సరాల తరువాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. త్రివిక్రమ్ ఈ సినిమాలో మహేష్ ని పూర్తి డిఫరెంట్ రోల్ లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాకు త్రివిక్రమ్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట సుమారు పదిహేను కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఈ సినిమాకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది..

 

ప్రస్తుతం మహేష్ బాబు గీతగోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా లో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతుందని ప్రచారం జరుగుతోంది.


Share

Related posts

భక్తజన సంద్రం.. అర్థకుంభమేళ!

somaraju sharma

త‌న‌తో డేటింగ్ చేయ‌లేదు…

Siva Prasad

బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ర‌కుల్.. ఏకంగా ఆయన పక్కనే..!

Teja