Ooriki Utharana: టాలీవుడ్ లో చిన్న సినిమాల హవా నడుస్తోంది.. చాలా చిన్న సినిమాలు వస్తున్నప్పటికీ కొన్ని సినిమాలు డిఫరెంట్ కథాంశంతో థ్రిల్ చేస్తూ ప్రేక్షక లోకానికి కొత్తదనాన్ని పరిచయం చేస్తున్నాయి..!! అటువంటి సినిమానే “ఊరికి ఉత్తరాన”..!! ప్రేమకు మరణం లేదు.. కానీ ప్రేమిస్తే మరణమే..! అనే డిఫరెంట్ జానర్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారు.. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు..!!
గాలి వచ్చిన సంగతి చెట్టు ఆకు చెప్తాది.. వన వచ్చిన సంగతి మట్టి వాసన చెప్తది.. కానీ ప్రేమ విలువ కన్నవాళ్ళు చచ్చాక తెలుస్తది.. అంటూ సాగే ఈ టీజర్.. వారం రోజులు గడువు ఇస్తున్న లేదంటే ఊరికి ఉత్తరాన ఉన్న వుట్టికి వేలాడదీస్తా.. అంటూ ఈ టీజర్ ముగిస్తుంది.. టీజర్ విడుదల ను కొద్ది క్షణాల్లోనే మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది..
ఈ సినిమాతో నరేన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. నరేన్ సరసన దీపాలి నటిస్తోంది. ఈగిల్ ఐ ఎంటర్టైన్మెంట్ వనపర్తి వెంకటయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కి సతీష్ పరమవేద దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విడుదలైన ఈ టీజర్ కం సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.. ఈ టీజర్ తో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!