Pawan Akhira Nandan: పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ అందరికీ సుపరిచితుడే. రేణు దేశాయ్ నీ పవన్ పెళ్లి చేసుకోక ముందే అకీరానందన్ పుట్టడం జరిగింది. ఆ తర్వాత 2009వ సంవత్సరంలో రేణుదేశాయ్ ని పెళ్లి చేసుకున్న పవన్.. 2012వ సంవత్సరంలో విడాకులు ఇవ్వటం అందరికి తెలిసిందే. అప్పటినుండి పవన్ కి పుట్టిన పిల్లలు.. అకీరా నందన్, ఆద్య ఇద్దరూ కూడా రేణు దేశాయ్ సంరక్షణలోనే పెరుగుతు వస్తున్నారు . ఈ క్రమంలో చాలావరకూ పిల్లలపై తల్లి ప్రభావం స్పష్టంగా చాలా సందర్భాలలో కనిపిస్తూ వచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ముఖ్యంగా పవన్ కొడుకు అకీరా నందన్.. అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీతో కొన్ని కార్యక్రమాలలో కలవటం తప్ప మిగతా సందర్భాలలో తల్లి రేణు దేశాయ్ వద్దే ఉంటూ వస్తుంటాడు. ఇదిలాఉంటే ఇటీవల అకిరా నందన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి తల్లి చెల్లి తో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ పట్టా అకీరా నందన్ తీసుకోవటం… ఆ తర్వాత స్పీచ్ ఇవ్వటం.. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తేలిసిందే. ఈ సందర్బంగా పవన్ ఫ్యాన్స్ కూడా అకీరానందన్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి సంబంధించి సోషల్ మీడియాలో భారీ ఎత్తున హడావిడి చేశారు. ఇదంతా పక్కన పెడితే ఈ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో… ఏ మాత్రం తండ్రి పవన్ కళ్యాణ్ ఇంటి పేరు కొణిదెలా….పేరు అకిరా నందన్ తన పక్కన పెట్టుకోకుండా ఉన్నట్లు సరికొత్త వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పవన్ ఇంటిపేరు కొణిదెల… ప్రస్తావన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో తన పేరు పక్కన రాకుండా తల్లి రేణుదేశాయ్ ఇంటికి సంబంధించిన పేరు మాత్రమే ప్రోగ్రాం బ్యానర్ లో తన సర్టిఫికెట్ లో నమోదు అయ్యేటట్లు అకీరానందన్ జాగ్రత్త పడినట్లు సరికొత్త వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కొణిదెల ఫ్యామిలీ తో… అనుబంధం పెట్టుకోవడానికి అకీరా నందన్ ఇష్టపడటం లేదన టాక్ వినిపిస్తోంది. అయితే అది ఎడిట్ చేసిన ఫోటోలు అన్న టాక్ కూడా మరోపక్క వినపడుతోంది. ఏది ఏమైనా తాజా పరిణామంపై మెగా అభిమానులు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై రేణుదేశాయ్ క్లారిటీ ఇవ్వాలని మరికొంతమంది ఫ్యాన్స్ కూడా.. వస్తున్న వార్తలపై స్పందిస్తున్నారు. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే కచ్చితంగా పవన్ కళ్యాణ్ కి మైండ్ బ్లోయింగ్ షాక్ కొడుకు అకిరా నందన్ ఇచ్చినట్లు అవుతుందని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!