Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రన్నర్ గా నిలిచిన షణ్ముక్ తాజాగా యాంకర్ శివ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ షో గురించి అదే విధంగా తన పర్సనల్ లైఫ్ గురించి షణ్ముఖ్ అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా సిరి వాళ్ల అమ్మగారు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆమె చేసిన కామెంట్లు గురించి ప్రశ్నలు వేయగ షణ్ముక్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. సడన్ గా సిరి వాళ్ళ అమ్మ హౌస్ లో అందరి ముందు కామెంట్లు చేయడం… నాకు చాలా బాధగా అనిపించింది.
పైగా ఆమెతో పర్సనల్ గా మాట్లాడిన సమయంలో అటువంటి కామెంట్లు చేయలేదు. అందరి ముందు ఉండగానే.. ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు హగ్ విషయంలో… వాళ్ళ అమ్మ చేసిన కామెంట్లు నన్నెంతగానో కృంగా తీశాయి. ఆమె అలా మాట్లాడకుండా ఉండాల్సింది. సన్నీతో నాకెందుకు గొడవ అయింది. అసలు గొడవ పెట్టుకోవడానికి నాకు ఏమైనా సరదానా..?. వాళ్ళ అమ్మాయి గురించే కదా గొడవ అయింది..? అవేమీ గుర్తులేవా ఆవిడకి.
హౌస్ లో ఎంట్రీ ఇవ్వడం.. నేరుగా వచ్చి.. నామీద శిరి వాళ్ళ అమ్మ చేసిన కామెంట్లు ఎంతో బాధగా అనిపించాయి. పక్కకు తీసుకెళ్ళి పద్ధతిగా చెప్తే బాగుండేది. చాలా తక్కువ చేసినట్టు ఆమె మాట్లాడారు. ఆ తర్వాత ఫినాలే జరిగిన తర్వాత రోజు సిరివల్ల బ్రదర్.. ఈ విషయం గురించి మాట్లాడారు. ఫీల్ అవ్వద్దు అని చెప్పాడు. ఆ సమయంలో మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి .. అంటూ మొదలు ఇచ్చాను అని షణ్ముక్ బిగ్ బాస్ హౌస్ లో సిరి వాళ్ళ అమ్మ తన పై వేసిన డైలాగులు గురించి ఇంటర్వ్యూ లో కీలక వ్యాఖ్యలు చేశాడు.