Shoot In Space: అంతరిక్షంలో సినిమా షూటింగ్..!!

Share

Shoot In Space: అంతరిక్షం నేపథ్యంలో చాలా సినిమాలను చూసాము.. అయితే వాటిని స్టూడియోస్ లో చిత్రీకరించి తరువాత వాటికి గ్రాఫిక్స్ జతచేస్తారు.. ఈ సినిమాలను గ్రీన్ మ్యాట్ పద్ధతిలో షూట్ చేసి గ్రాఫిక్స్ అవసరం ఉన్న చోట జతచేస్తారు.. అంతరిక్ష నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా సినిమాలే వచ్చాయి.. అయితే ఇప్పుడు వాటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా.. ఎందుకంటే త్వరలోనే ఒక సినిమా అంతరిక్షం లోనే షూటింగ్ జరుపుకోనుంది.. ఇంతకీ ఏంటి ఆ సినిమా.. నిజంగానే తెరపై అంతరిక్షాన్ని చూడనున్నామా..

Shoot In Space: The First movie on shooting
Shoot In Space: The First movie on shooting

అంతరిక్షంలో షూటింగ్ జరుపుకుంటున్న మొదటి సినిమా ఛాలెంజ్.. హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను క్లీమ్ షిఫెన్కో తెరకెక్కించబోతున్నాడు. రష్యాకు చెందిన స్పేస్ ఏజెన్సీ రోస్ కాస్మోస్ Roscosmos త్వరలోనే అంతరిక్షంలో షూటింగ్ జరపనున్నట్లు ప్రకటించింది. ఇందులో రష్యన్ నటి యూలియా పెరెసిల్డ్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. అంతరిక్షం నేపద్యంలో చాలా సినిమాలే వచ్చినప్పటికీ.. ఇంతవరకు అంతరిక్షంలో షూటింగ్ జరిగిన సినిమా ఇప్పటి వరకు లేదు.. రష్యా ఇందుకు సిద్ధమవడం గొప్ప విశేషం. ఈ సంవత్సరంలో అక్టోబర్ లో ఓ రష్యన్ రాకెట్ ద్వారా ఈ సినిమా  షూటింగ్ ప్రారంభించనున్నారట.

 

అప్పటివరకు యూలియా, క్లీమ్ షిఫెన్కో, అలెనా మోర్డోవినా , కెమెరా మెన్ అలేక్సీ డుడిన్ లకు స్పేస్ ఏజెన్సీ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తుందట. గత సంవత్సరం టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో ఒక సినిమాను అంతరిక్షంలో చిత్రీకరించబోతున్నారు అట్లు నాసా ప్రకటించింది అయితే కొన్ని కారణాల వల్ల అనూహ్యంగా ఆగిపోయింది ఇప్పుడు అంతరిక్షంలో రూపొందించేందుకు రష్యా అమెరికా పోటీపడుతున్నాయని హాలీవుడ్ వర్గాల్లో కథనాలు వస్తున్నాయి.. మొత్తానికి ఈ సినిమా విడుదల అయితే.. ప్రత్యక్షంగా తెరపైనే అంతరిక్షాన్ని చూడ వచ్చేమో..


Share

Related posts

రియాలిటీ షో వ్యాఖ్యాతగా రానా 

Siva Prasad

భారతరత్నకు బాలయోగి అర్హుడు కాదా?

somaraju sharma

మ‌రో త‌మిళ చిత్రం…

Siva Prasad