బిగ్ బాస్ లో హౌస్ మేట్స్ మధ్య కొత్త కొత్త రిలేషన్స్ ఏర్పడుతుంటాయి. ఉన్న కొద్ది రోజుల్లోనే గొడవపడో, సంతోషపెట్టో వారి మధ్య కొత్త బంధం పుట్టుకొస్తుంటుంది. బిగ్ బాస్ ఇంటి నుంచి బయట పడిన తర్వాత కొందరు వారి రిలేషన్ మరిచి పోయినా మరికొందరి మధ్య మాత్రం ఆ రిలేషన్‌ను అలాగే మెయిన్ టెన్ చేస్తూ ఉంటారు.
బిగ్ బాస్ 3 హౌస్ మేట్స్ మధ్య కూడా ఇలాంటి రిలేషనే కొనసాగుతుంది. అందులో రాహుల్, రవి, అలీ రెజా, శివజ్యోతి, హిమజ, అషూ రెడ్డి లు ఏదో రకంగా వార్తలో నిలుస్తూనే ఉన్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ వార్తలో నిలుస్తున్నారు. బిగ్ బాస్ ఇంట్లో అతనికి పునర్నవికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో అందరికీ తెలిసిందే. అయితే ఇంటినుంచి బయటకు వచ్చాక వారిరురి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని, కేవలం ఫ్రెండ్స్ మాత్రమే నని చెప్పుకొచ్చారు. అయినా వార్తలు మాత్రం ఆగలేదు. వారిరువురికి పెళ్లి కూడా ఫిక్స్ అయిందన్న వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. కాగా హౌస్‌లో అప్పుడున్న క్లోజ్ నెస్ పునర్నవితో ఇప్పుడు లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా అషూ రెడ్డితో మాత్రం క్లోజ్ గా మూవ్ అవుతున్నాడని ప్రస్తుతం పుకార్లు షికార్లు కొడుతున్నాయి. బయట ఎలాంటి పార్టీలకు వెళ్లినా ఈ ఇద్దరి హవానే నడుస్తోంది. దీంతో నిటిజెన్లు మాత్రం వీరు లవ్ లో ఉన్నట్టు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ తమ మధ్య అలాందేమీ లేదని వారు మంచి దోస్తులమంటూ రాహుల్ సిప్లిగంజ్ అషూతో ఉన్న రిలేషన్ పై ఒక క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ రోజు రాహుల్ తల్లి సుధారాణి పుట్టిన రోజు సంధర్బంగా అషూరెడ్డి ప్రత్యేకంగా విష్ చేసింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!