NewsOrbit
న్యూస్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు..ఏమిటంటే..?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ లకు జగన్ సర్కార్ తీపి కబురు అందించింది. జూన్ నెలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపులు జరగని విషయం తెలిసిందే.

శాసన మండలిలో ద్రవ్యవినిమయ బిల్లుకు టీడీపీ అడ్డుపడటంతో ఉద్యోగులకు ఈ నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని మంత్రులు టీడీపీ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావడానికి కారణం టీడీపీయే అంటూ వైకాపా నేతలు ఆరోపించారు. అయితే మంత్రుల వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించారు. దీనిపై వైకాపా, టీడీపీ ల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టకుండా అధికారపక్షం సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై రచ్చ చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, దానికి అధికార పక్షమే కారణం అని టీడీపీ ప్రత్యారోపణ చేసింది.

ఇది ఇలా ఉండగా ఉద్యోగుల జీతాల చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 6, 7 తేదీల్లో ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ద్రవ్యవినిమయ బిల్లు జూన్ 30వ తేదీ సాయంత్రానికి ఆమోదం పొందింది. రాష్ట్ర ప్రభుత్వం జూలై 1న గవర్నర్‌కు ప్రతిపాదనలను పంపించింది. ద్రవ్యవినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేడు శనివారం, రేపు ఆదివారం కావడంతో సోమవారం ,లేదా మంగళవారాల్లో జీతాలు, పెన్షన్లు అందేఅవకాశం ఉంది. గెజిట్‌ నోటిఫికేషన్‌ వచ్చాకే బిల్లులు తయారు చేయాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju