NewsOrbit
Featured దైవం న్యూస్

Daily Horoscope జూలై 7 మంగళవారం మీ రాశి ఫలాలు

మేష రాశి : ఈరోజు పెట్టుబడులు పేట్టే విషయంలో జాగ్రత్త !

ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే, ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు వత్తిడి కారణం కావచ్చును. భావోద్వేగాలు మిమ్మల్ని చీకాకు పెడతాయి. మీకు నాయకత్వ లక్షణాలున్నాయి. ప్రజల అవసరాలపట్ల సానుభూతి ఉన్నది. మీరనుకున్నది గట్టిగా చెప్పడం అనేది మీకు భారీగా విజయాలను గెలుచుకునే వీలును కల్పిస్తుంది. మీకు ఖాళీ సమయము దొరికినప్పటికీ మీరు మీకొరకు ఏమి చేసుకోలేరు. మీరు ఈరోజు కష్టపరిస్థితిని ఎదుర్కున్నా మీ భాగస్వామి మీకు సహకారం అందించరు.

రెమిడీ: ఆరోగ్యకరమైన జీవితం కోసం శ్రేయస్సుకరమైన ఆలోచనలు మాత్రమే చేయండి. పక్షులకు నీరు, ధాన్యాలను పెట్టండి.

 

వృషభ రాశి : ఈరోజు అనుకూలమైన రోజు !

బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చెయ్యవలసి ఉన్నది. మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచిరోజు కాగలదు. ఖాళీ సమయములో ఈరోజు మీరు మీ ఫోనులో ఏదైనా వెబ్‌ సీరీస్ ను చూస్తారు. వైవాహిక జీవితం ఉన్నవారు ఆనందంగా గడుపుతారు.

రెమిడీ: మెరుగుపర్చిన ఆరోగ్య ప్రయోజనాల కోసం సాత్విక ఆహారం తీసుకోండి.

 

మిథునరాశి : ఈరోజు మీ వస్తువులు జాగ్రత్త !

 

అంతులేని మీ ఆ విశ్వాసం, సులువుగా పని జరిగే ప్రణాళిక, మీకు ఈరోజు సమయాన్ని మిగులుస్తుంది. మీ సహుద్యోగుల్లో ఒకరు మీ విలువైన వస్తువును దొంగిలిస్తారు, కాబట్టి మీరు మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము మీ సరదా మనస్త్వత్వం మీ చుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తిచేసిన పనులకుగాను అధికారుల మన్ననలు పొందుతారు. మీ పనితనం వలన మీరు ప్రమోషనలు పొందవచ్చును. అనుభవంగల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈ రోజు సాధారణం కంటే చాలా స్పెషల్ గా ఉండే అవకాశం ఉంది.

రెమిడీ: ఆర్థికంగా పెరగడం కోసం శ్రీలక్ష్మీగణపతి ఆరాధన, తియ్యని ప్రసాద సమర్పణ చేయండి.

 

కర్కాటక రాశి : ఈరోజు పనిలో సానుకూల ఫలితాలు !

మీరు ఖాళీ సమయం అనుభూతిని పొందబోతున్నారు. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. పనిలో అన్ని విషయాలూ ఈ రోజు సానుకూలంగా కన్పిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనుంది. ఈరోజు మీ జీవితభాగస్వామితో గడపటానికి మీకు సమయము దొరుకుతుంది. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా కన్పిస్తుంది ఈ రోజు.

రెమిడీ: కుటుంబానికి ఆనందాన్ని మెరుగుపర్చడానికి శ్రీసుబ్రమణ్య ఆరాధన చేయండి.

 

సింహ రాశి : ఈరోజు ఆర్థికపరమైన కోర్టు వ్యవహారాలు అనుకూలం !

విజయోత్సవాలు, సంబరం మీకు అమితమైన సంతోషాన్నిస్తాయి. మీ ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకొండి. ఆర్ధికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్ధిక లాభాన్ని చేకూరుస్తుంది. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది. మీ జీవిత భాగస్వామి తో ఆనందాన్ని, సంతోషాన్ని పంచుకుంటారు.

రెమిడీ: వ్యాధి-రహిత జీవితం కోసం సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యుడిని ప్రార్థన చేయండి. సూర్యకిరణాలు తగిలేలా నిలబడి నమస్కారాలు చేయండి.

 

కన్యా రాశి : ఈరోజు చిరకాలంగా ఉన్నబకాయిలు అందుతాయి !

చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందు తాయి. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు; ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారీ రోజు. కుటుంబ అవసరాలు తీర్చేక్రమంలో, మీకొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీకొరకు కొంత సమయాన్నికేటాయిస్తారు. వివాహ జీవితం ఆనందంగా సాఫీగా సాగుతుంది ఈరోజు.

రెమిడీ: కుక్కలకు రొట్టె ఇవ్వడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందుతారు.

 

తులా రాశి : ఈరోజు స్నేహితుల మాట వింటే లాభాలకు అవకాశం !

వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అని మీ పాతస్నేహితుడు సలహాలు ఇస్తారు. మీరు వారి సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టము కలసి వస్తుంది. ప్రశంసనీయమైన పనులనే చెయ్యండి. అవికూడా మీ పేరు ప్రతిష్ఠలను పెంపొందించేవి అయి ఉండాలి. స్వచ్ఛమయిన ఉదారమైన ప్రేమవలన గుర్తింపు పొందుతారు. ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.

రెమిడీ: శ్రీసూక్తపారాయణం చేయండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

 

వృశ్చిక రాశి : ఈరోజు ఉక్కిరిబిక్కిరి అయ్యే వార్తలను వినే అవకాశం !

మీ భయాన్ని నివారించుకోవడానికి ఇది కీలకమైన సమయం. అది, శారీరక శక్తిని తగ్గించ డమే కాదు, ఆయుర్దాయాన్ని కూడా హరించివేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీ ధనము జాగ్రత్త. ఉక్కిరిబిక్కిరి అయ్యే వార్తను పిల్లలు మీకు అందించవచ్చును. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడే టప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి, లేనిచో అనవసర తగాదాలు,గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది. ఈరోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది.

రెమిడీ: ఆర్థికంగా బలంగా కావడానికి నిత్యం లక్ష్మీస్తోత్రం పారాయణం చేయండి.

 

ధనుస్సు రాశి : ఈరోజు అనారోగ్య సమస్యల నుంచి విముక్తి !

చాలాకాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. కుటుంబంతోను, స్నేహితులతోను సంతోషంగా ఉండే సమయం. ఈరోజుఈరాశి  కొంతమంది విద్యార్థులు వారి సమయాన్ని టీవీ, కంప్యూటర్ చూడటం ద్వారా సమయాన్నివృధా చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది.

రెమిడీ: జీవితంలో వృత్తిపరమైన అభివృద్ధి కోసం కాలభైరావాష్టకం పఠించండి.

 

మకర రాశి :ఈరోజు ఇంటర్వ్యూలకు హాజరుకావడానికి అనుకూలం !

మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను, కోరికలను అదుపులో ఉంచండి. మీరు సమయానికి, ధనానికి విలువ ఇవ్వవలసి ఉంటుంది, లేనిచో రానున్న రోజులలో మీరు సమస్యలు,పరీక్షలు ఎదురుకొనక తప్పదు. మీ రెస్యూమ్ ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి మంచి రోజు. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు.

రెమిడీ: గంధాన్ని వర్తింప చేసుకోండి. అనుకూలమైన ఆరోగ్యం వస్తుంది.

 

కుంభ రాశి : ఈరోజు మీ కలలు సాకారం అయ్యే అవకాశాలున్నాయి !

ఈరోజు మిమ్ములను మీరు అనవసర, అధిక ఖర్చుల నుండి నియంత్రించుకోండి. లేకపోతే మీకు ధనము సరిపోదు. మీ లక్ష్యం చేరుకుంటారు, మీ స్థిర సంకల్పం నెరవేరే అవకాశం ఉంది. మీకలలు సాకారమవడం మీరు చూస్తారు. కాకపోతే నమ్మకంగా కష్టపడి పనిచెయ్యడం కొనసాగించండి. మీకు మీ భాగస్వామి మధ్య చక్కగా సాగుతున్న మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడుచేయవచ్చు. అది కాస్తా చివరికి వాదనకు దారితీసే అవకాశం ఉంది జాగ్రత్త.

రెమిడీ: మంచి ఆర్థిక పరిస్థితి కోసం పేద ప్రజలకు ఆహారపదార్థాలు పంపిణీ చేయండి.

 

మీన రాశి :ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి సహకారాలు అందుతాయి !

మీ అద్భుతమైన శ్రమ, సమాయానికి మీ కుటుంబ సభ్యులనుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను వస్తాయి. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని, లాభాలని తెస్తుంది. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకొండి. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీ రు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకుగల నైపుణ్యాలను, అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. వరస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన, మీకు, మీ శ్రీమతికి మధ్య విబేధాలు వస్తాయి.

రెమిడీ: ఆరోగ్య ప్రయోజనాలు కోసం గంగాజలంతో అభిషేకం చేయండి.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju