NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

తెలంగాణలో మునుపెన్నడూ లేని కొత్త సమస్య..!

తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడూ చెప్పగా సాగుతుంటాయి. సీఎం కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, కుమార్తె కవిత వీరు నలుగురు ప్రత్యర్థులపై మాటలతో విరుచుకుపడుతుంటారు. రేవంత్ రెడ్డి మినహా ఏ రాజకీయ ప్రత్యర్థి కూడా వీరి మాటలకు సరైన కౌంటర్ ఇవ్వలేరు. ఇటు వంటి పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాలు చెప్పదనం నుంచి ఇప్పుడు చిక్కదనానికి వచ్చాయి. సీఎం కేసీఆర్ పది రోజుల నుంచి కనిపించకపోవడంతో అయన ఆరోగ్యంపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఇదే సందర్భంలో ఈ 10 రోజుల వ్యవధిలో తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటం, ప్రభుత్వానికి, ఆసుపత్రులకు, వైద్య విభాగానికి చేతులు దాటే పరిస్థితి రావడంతో ప్రతిపక్షాలకు పని పడింది. రేవంత్ రెడ్డి మినహా ఎన్నాళ్ళు గట్టిగా మాట్లాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి, బండి సంజయ్, పొన్నాల లక్ష్మయ్య లాంటి నాయకులు కూడా ఈ రెండు మూడు రోజుల నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఆ ఫ్యామిలీ పై విరుచుకు పడుతున్నారు. ఈ సందర్భంలో తాజాగా కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి పై తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. మన అందరికీ, మీడియాకి బాగా పరిచయం ఉన్న టీవీ ఫైవ్ మాస్ మల్లన్న ఈ పిటిషన్ దాఖలు చేశారు.

 

పిటిషన్ లో ఏముందంటే..

  • ప్రగతి భవన్ లో 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. అప్పటి నుండి సీఎం ఫామౌస్ కి వెళ్లారు.
  • ముఖ్యమంత్రి ఫామౌస్ కు వెళ్లిపోయినట్టు యూట్యూబ్ లో ప్రచారం జరుగుతోంది.
  • ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం తెలియాల్సిన అవసరం రాష్ట ప్రజలకు ఉంది.
  • ముఖ్యమంత్రి గా కేసీఆర్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం లేదు.
  • ప్రభుత్వంలో పనిచేస్తున్న వివిధ విభాగాలకు చెందిన అధికారులు ముఖ్యమంత్రి లేకపోవడం వలన సక్రమంగా పనిచేయడం లేదు.
  • గత నెల రోజుల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించడం లేదు.
  • తన ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆందోళన చెందుతున్నారు.
  • తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏంతో కృషి చేసి తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.
  • కరోనాను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేసారు.
  • అనేక మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలకు ధైర్యం చెప్పారు.
  • అనేక పత్రికల్లో, మీడియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వార్తలు వస్తున్నాయి.
  • గత నెల 28 న మాజీ ప్రధాని పీవీ శత జయంతి రోజు మీడియా ముందుకు వచ్చారు.
  • ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందొ తెలపాలి.

* ఇప్పటికే పది రోజుల నుండి బయటకు కనిపించక అయన ఆరోగ్య పరిస్థితి తెలియక ప్రతిపక్షాలతో పాటు టీఆర్ఎస్ లోని ఒక వర్గానికి కూడా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. 70 ఏళ్లకు దగ్గరలో ఉన్న కేసీఆర్ కు కరోనా వచ్చింది అనే పుకార్లు తెలంగాణ అంతటా వ్యాపించాయి. కొన్ని చిన్న పత్రికల్లో కూడా వచ్చాయి. ఇది నిజమా కాదా అనే తెలియని సందిగ్ధంలో టిఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి. రాష్ట్రమంతటా విపరీతంగా విజృంభిస్తున్న సమయంలో అధికార పార్టీ తరఫున గట్టిగా మాట్లాడే వాళ్ళు, వైద్య విభాగానికి దీక్షుచిగా నిలిచే వాళ్ళు లేకపోవడం, ఇప్పుడు సరికొత్త ప్రశ్నలకు తావిస్తోంది. కరోనా ఆరంభంలో వారానికి ఒకటి, రెండు సార్లు ప్రెస్ మీట్ లు పెట్టి హడావుడి చేసిన కేసీఆర్ కరోనా పిక్స్ లో ఉన్నప్పుడు అసలు కనిపించకపోవడం, అయన ఆరోగ్య పరిస్థితి పై సందేహాలు రావడం ఇవన్నీ తెలంగాణ రాష్ట్రానికి కొత్త సమస్యగా పరిణమించాయి.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju