NewsOrbit
న్యూస్

ఫ్రం టీటీడీ: సప్తగిరి ప్లస్ ఉజ్జీవ సువార్త?

ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో రోజు రోజుకీ వివాదాలు పెరిగిపోతున్నాయి. టీటీడీపై అన్యమత ప్రచారం బలంగా వస్తూ ఉంటుండటం.. వాటిని జగన్ సర్కార్ విచారణ జరిపి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపడం జరుగుతూనే ఉంది! ఆ సంగతులు అలా ఉంటే తాజాగా మరో వివాదం వచ్చిపడింది. అదేమిటంటే… టీటీడీ నుంచి వచ్చిన పోస్టులో “సప్తగిరి” పత్రికతో పాటు అన్యమత సువార్త పుస్తకం కూడా ఒకే కవర్ లో రావడం!

అవును… గుంటూరులో ఓ వ్యక్తికి టీటీడీ సప్తగిరి పత్రికతోపాటు అన్యమత సువార్త పుస్తకం ఈనెల 6న పోస్టులో వచ్చిందని ప్రచారం జరిగింది. దీంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. పోలీసు విచారణకు ఆదేశించింది. దీంతో గుంటూరుకు చేరుకొన్న తిరుపతి పోలీసులు.. మల్లికార్జునపేటలోని సప్తగిరి పత్రిక చందాదారుడు విష్ణు నివాసంలో విచారణ చేశారు. ఇదే క్రమంలో పోస్ట్ మ్యాన్ ను కూడా విచారించారు! బాధ్యులపై చర్యలు తప్పవని తెలిపారు!

ఆ సంగతులు అలా ఉంటే… ఈ వ్యవహారం కూడ రాజకీయ రంగు పులుముకుంది! కచ్చితంగా ఈ పనిని టీడీపీ పైనా, ప్రభుత్వం పైనా బురదజల్లడానికి ఎవరో కంకణం కట్టుకుని చేసినట్లుగానే ఉందని వైకాపా నేతలు చెబుతున్నారు. లేకపోతే అన్ని వేలమందికి రాని అన్యమత పుస్తకం… కేవలం ఒకరి పోస్టులో మాత్రమే రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఈ వివాదంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. సప్తగిరి పత్రికతోపాటు అన్యమత పుస్తకాలు కూడా పంపుతున్నారన్నది శుద్ధ అబద్దమని.. దీనివెనుక కచ్చితంగా కుట్ర దాగుందని తాను నమ్ముతున్నానని.. విచారణ జరిపిస్తామని తెలిపారు.

Related posts

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N