NewsOrbit
న్యూస్

పౌరుషం లేకనా ! ప్రత్యామ్నాయ పార్టీ కాన రాకనా !

నిజానికి న‌ర‌సాపురం నుంచి గెలిచిన రాజులు చాలా పౌర‌ుష‌వంతులుగా పేరు ప‌డ్డారు. కానీ, ఆ రాజుగారు.. ఏకంగా త‌న‌పై అన‌ర్హ‌త వేటువేయాల‌నే క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్న పార్టీలో ఎందుకు కొన‌సాగడం?  ఆ పాటి పౌరుషం లేదా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

 

ఇలాంటి నిత్య అస‌మ్మ‌తి వాదిని చేర్చుకునేందుకు ఏ పార్టీ కూడా ఇష్ట‌ప‌డ‌ద‌నే విష‌యం స్ప‌ష్టం కావ‌డం లేదా?! ఇంకా వైసిపి చూరు పట్టుకుని ప‌ట్టుకుని వేలాడ‌డం ఎందుకు రాజు గారూ అనే గొంతుక‌లు లే‌స్తున్నాయి.న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామకృష్ణ‌రాజు తాజా వ్యాఖ్య‌ల‌ను ప‌రిశీలిస్తే.. ఆయ‌న‌లో ఇంకా పార్టీలో త‌న‌కేదో ప్రాధాన్యం ఇస్తున్నార‌నే ఆశ ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతేకాదు, ఇంకా తానుపార్టీలోనే ఉన్నాన‌ని అనుకోవడాన్ని కూడా వారు ఎద్దేవా చేస్తున్నారు. నిజానికి ఈ విష‌యంలో వైఎస్సార్ రాజ్య‌స‌భ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి.. ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు. ర‌ఘురామ రాజుని.. మా పార్టీలో దూరం పెట్టాం.

ఆయ‌న స‌భ్యుడే అయిన‌ప్ప‌టికీ.. అన‌ర్హ‌త వేటు వేయాల‌ని లోక్‌సభ స్పీక‌ర్‌కు కూడా ప‌త్రం ఇచ్చామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ ప‌రిణామాలు గ‌మ‌నించిన త‌ర్వాత‌.. ఓ విష‌యం క్లారిటీ వ‌చ్చింది.అంద‌రూ కూడా ర‌ఘు సాంకేతికంగా పార్టీలో ఉన్నాడే త‌ప్ప‌.. నైతికంగా ఆయ‌న‌ను జ‌గ‌న్ ఎప్పుడో బుట్ట‌దాఖ‌లు చేశార‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యంలో ర‌ఘుకు క్లారిటీ లేద‌ని కాదు.. కానీ, ఆయ‌న ఆడుతున్న దొంగ పోలీస్ ఆట‌.. ర‌స‌కందాయానికి చేరుకున్న‌ట్టే చేరుకుని యూ ట‌ర్న్ తీసుకోవ‌డ‌మే. వాస్త‌వానికి ఆయ‌న వైఎస్సార్ సీపీలోనే ఉన్నాన‌ని అంటున్నారు. కానీ, వ్యూహాత్మ‌కంగా ఎదురుదాడి చేస్తున్నారు. ఇదే పార్టీలో తీవ్ర విమ‌ర్శ‌ల‌కుదారితీసింది. పైగా ఈ ప‌రిణామం విప‌క్షాల‌కు జ‌గ‌న్‌పై మ‌రిన్ని అస్త్రాల‌ను అందించిన‌ట్ట‌యింద‌నేది వాస్త‌వం.

`నేను పార్టీలోనే ఉన్నాను.. ఉంటాను.. అంటూనే సొంత పార్టీ చూరుకే నిప్పు పెట్టేలా వ్య‌వ‌హ‌రించ‌డం మాత్రం మానుకోలేదు.కానీ వైసీపీ ఆయన్ను పూర్తిగా దూరం పెట్టించడానికి ఇటీవల జరిగిన ఒక సంఘటన నిదర్శనం.తాజాగా వైఎస్సార్ సీపీ నాయ‌కుడు, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ఎంపీ ర‌ఘుకు గ‌ట్టి షాక్ ఇచ్చారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పార్టీ నేత‌ల‌తో ఆయ‌న మీటింగ్ పెట్టారు. దీనికి అంద‌రినీ పిలిచారు. ఒక్క ‌రఘురామరాజు‌ను త‌ప్ప‌. ఈ మీటింగ్‌లోనే జిల్లా క‌రోనా ప‌రిస్థితి స‌హా నిధుల విష‌యం, అభివృద్ధిపైనా చ‌ర్చ‌జ‌రిగిన‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలో.. కీల‌క‌మైన న‌ర‌సాపురం ఎంపీని పిల‌వ‌క‌పోవ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు అవ‌కాశం ఇచ్చింది.ఇదే వైసీపీలో రఘురామరాజుకున్న సీను. ఇంకా ఆయనకేమైనా ఆశలు ఉన్నాయనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు!

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju