NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

‘నిమ్మ’కాయను ఎరగా వేసి ‘గుండె’కాయను పట్టేశారు..!

ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ అంతా అమరావతి గురించే. దాదాపు ఎనిమిది నెలలు జగన్ విపరీతంగా పోరాడి తన మూడు రాజధానులు కలను నెరవేర్చుకున్నాడు. టీడీపీ ఇకపై ఏ కోర్టుకు తిరిగినా కూడా పెద్దగా లాభం లేదన్నది అందరి మాట. ఫ్యూచర్ విషయాలను పక్కన పెడితే… జగన్ ఇన్ని రోజులు చంద్రబాబు వ్యూహాలకు తడబడుతూ సమయం కోసం వేచి చూసి తనదైన శైలిలో అదను చూసి చావు దెబ్బ కొట్టినట్లు అయింది. మొదటి నుండి జగన్ కు ముక్కుసూటిగా వ్యవహరించడం…. దూకుడుగా ఎదురు వెళ్లడం మాత్రమే తెలుసు అంటారు కానీ తొలిసారి కొత్త పంథాలో టిడిపి వారిని బోల్తా కొట్టించిన జగన్ నడిపిస్తున్న వైసీపీ ప్రభుత్వం చాకచక్యత ను ఎంత మెచ్చుకున్నా తక్కువే.

 

విషయం ఏమిటంటే.. అటు ప్రజలతో పాటు ఇటు వైసీపీ కి కూడా నిమ్మగడ్డ విషయంలో ఇక ప్రభుత్వానికి ఓటమి తప్పదని హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలుసు. అయితే ఇక్కడే జగన్ ముందు చూపుని మెచ్చుకోవాలి. నిమ్మగడ్డ వ్యవహారాన్ని ఆ కారణంతో ఈ కారణంతో కావాలనే సాగదీసి ఈ లోపల రెండవసారి రాజధాని వికేంద్రీకరణ బిల్లుని అసెంబ్లీలో అతికష్టం మీద ప్రవేశపెట్టాడు. హైకోర్టులో సెలెక్ట్ కమిటీని అడ్డం పెట్టుకుని వికేంద్రీకరణ బిల్లు పై విచారణను ఆలస్యం చేశాడు. ఈ లోపల నిమ్మగడ్డ ఎన్నికల కమీషనర్ నియామకం వ్యవహారంపై హైకోర్టు విపరీతమైన ఆగ్రహంతో రగిలిపోయి గవర్నర్ వద్దకు వెళ్లాలని రమేష్ కుమార్ ను సూచించింది. ఇదే సమయంలో జగన్ రెండు సార్లు మండలిలో బిల్లును ప్రవేశపెట్టినా కూడా అది పెండింగ్ లో ఉంది కాబట్టి ఇదే సమయమని రమేష్ కుమార్ వెళ్లిన వెంటనే రాజధాని వికేంద్రీకరణ బిల్లు ను మరియు సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా పంపించాడు.

ఇక్కడి నుండి జగన్ అసలు గేమ్ ప్లాన్ మొదలైంది. సరిగ్గా చెప్పాలంటే గవర్నర్ నిమ్మగడ్డను ఎన్నికల కమీషనర్ గా నియామకం జరపాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయడం తప్ప ఇంకో నిర్ణయం తీసుకులేని పరిస్థితి. అక్కడ తొలిసారి అతను జగన్ ప్రభుత్వానికి ఎదురు వెళ్ళినట్లు అయింది. దీనితో ప్రతిపక్షాలకు రాజధాని వికేంద్రీకరణ బిల్లు పై కూడా గవర్నర్ ఇలాగే వ్యవహరిస్తారు అన్న ఆశ కలిగింది. వెంటనే లేఖల పైన లేఖలు రాయడం మొదలుపెట్టాడు.

ఈ లోపల తన లీగల్ టీం తో రాజకీయ వికేంద్రీకరణ బిల్లు క్షుణ్ణంగా పరిశీలించి.. రాజ్యాంగబద్ధంగా మండలి, సభ చట్టాలను చదివి… వీరు రాసిన లేఖలలోని అంశాలను ప్రస్తావించి.. అన్నిటినీ బేరీజు వేసి చివరికి ఆమోదముద్రకు తగిన సమయం తీసుకొని జగన్ కు గుడ్ న్యూస్ తెలిపారు. ఇక దీనిపై టిడిపి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ఒరిగేది ఏమీ లేదు అన్నది అందరి మాట. ఇకపోతే నిమ్మగడ్డ వ్యవహారంలో జగన్ పెద్దగా కోల్పోయినది ఏమీ లేదు…. కానీ రాజధాని విషయంలో మాత్రం అతను సాధించింది ఎంతో ఉంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N