NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ బిగ్ స్టోరీ సినిమా

తరగని రాజశం – చెదరని దర్పం  – తెలుగు సినిమాలో పోటీ అనే ప్రశ్న కూడా లేని మేటి సూపర్ స్టార్

నీ నవ్వు వరం నీ కోపం శాపం…. నీ మాట శాసనం..!” అసలు ఇలాంటి డైలాగ్ తో ఒక వ్యక్తికి లేదా క్యారెక్టర్ కు ఎలివేషన్ ఇస్తున్నాము అంటేఅంతటి ఒక పదునైన డైలాగ్ రాసేందుకు, బలమైన స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఆ రైటర్ కు ఎంతటి ధైర్యం ఉండాలి..? ఎంత మాటల మాంత్రికుడు అయినా తన ఊహల్లో అందుకు తగిన హీరో లేకపోతే అటువంటి పదాలు బయటకు రావు. ఇక అలాంటి పదాలను న్యాయం చేసే హీరో ఏకైక హీరో టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్…. కొద్దికాలంలోనే మహేష్ బాబు తండ్రి కృష్ణ అని నేటి తరం గుర్తించేలా ఎదిగిపోయాడు.

 

Superstar Mahesh Babu Strongly Recommends Watching This!

మహేష్ బాబు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమయంలో చిరంజీవి టాప్ ఫామ్ లో ఉన్నాడు. బాలకృష్ణ కూడా వరుస హిట్లతో ఆదరగొట్టేస్తున్నాడు. వెంకీ కుటుంబాలతో కలిసిపోయాడు. నాగార్జున అమ్మాయిల మనసులో తిష్ట ఏసుకొని కూర్చున్నాడు. పవన్ కళ్యాణ్ ఉనికి కూడా మొదలైంది అదే సమయంలో. అయితే మొదటి నుండి మహేష్ బాబుని హీరోగా నిలబెట్టింది ఒక మంచి నటుడిగా తీర్చిదిద్దింది అతడికి వైవిధ్యభరితమైన కథలపై ఉన్న మక్కువే. వరస ఫ్లాపులతో ఉన్నప్పుడు కూడా ఏ మాత్రం కమర్షియల్ హంగులు లేని ‘మురారి’ లాంటి కుటుంబ కథా చిత్రంతో మళ్లీ అతని నిలదొక్కుకున్న తీరు మహేష్ బాబు కి సినిమాపై ఉన్న ఎనలేని ప్రేమ, వైవిధ్యత పై ఉన్న అపార నమ్మకాన్ని తెలియజేస్తాయి. అతనికి ఒక పెద్ద స్టార్ కావాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయని చాటి చెప్తాయి.

అంతెందుకు కౌబాయ్ సినిమా చేయాలన్నా కబడ్డీ ప్లేయర్ గా ఉన్నవాడు కర్నూలు ఫ్యాక్షనిస్ట్ ను పరిగెత్తించి కొట్టాలన్నా పోలీస్ వాడు కాస్తా పోకిరీలా మారి ప్రేక్షకులను మాయ చేయాలన్నాట్యాక్సీ డ్రైవర్ లో ఉన్న దేవుడిని ప్రజలకు పరిచయం చేయాలన్నాఅర్జున్, గౌతమ్ ల లా కుటుంబాన్ని ప్రేమించాలన్నా.. చిన్నోడిలా కలుపుకుపోవాలన్నా…. సీఎం లా కలుపు మొక్కలను ఏరివేయాలన్నాఅజయ్ లా బాధ్యత తెలియజేయాలన్నా.. అన్నిటికీ అతనే కావాలి. తన కెరీర్ లోని ప్రతీ దశలో తనదైన శైలిలో వినూత్నమైన నటనను కనబరిచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేష ప్రజాదరణ సంపాదించాడు సూపర్ స్టార్ మహేష్. అసలు రజినీకాంత్ వంటి పెద్ద పర్సనాలిటీ కి ఉన్న సూపర్ స్టార్అనే ట్యాగ్ ను మహేష్ అవలీలగా తనకు ఆపాదించుకున్న తీరు ఇప్పటికీ చాలామందికి నమ్మశక్యం కాదు. పెద్దోళ్ళు ముద్దుగా ప్రిన్స్ అంటారుఆడపిల్లలు తమ కలల రాజకుమారుడు అంటారు కానీ మహేష్ బాబు మాత్రం ఎప్పటికీ మన తెలుగు సినిమా సూపర్ స్టారే.

Mahesh Babu on learning from failure, growing up with a star ...

ఇప్పటివరకూ తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూపర్ స్టార్ కృష్ణఅని చెబుతారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని అతని కొడుకే దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. సహజంగానే అందగాడైన మహేష్ బాబు తన హావభావాలతో కొంటె చూపులతో.. చిలిపి చేష్టలతో, సైగలతో ఎన్నో వేల మంది అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టారు. అంతెందుకు అసలు మహేష్ మీద ఉన్న పిచ్చి తో.. అతని పేరంటేనే చచ్చిపడే ఒక అమ్మాయి పైనే ఒక సినిమా అంతా అందరితోఅష్టాచమ్మాఆడించి.. మంచి హిట్ కొట్టి అక్కడినుండి నాని లాంటి హీరో బయటకు వచ్చి స్టార్ అయ్యాడు అంటే మహేష్ బాబు రేంజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

Hyderabad Most Desirable Men 2019: Where is Mahesh Babu? - Gossiper

ఇక దర్శకుల హీరో అని పిలువబడే మహేష్ ప్రయోగాల మోజులో పడినప్పుడు వచ్చిన పరాజయాలతో ఏనాడూ కుంగిపోలేదు. నాని సినిమా తో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని తపన పడ్డాడు. అర్జున్ సినిమాతో అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని ఎవరికీ వీలు కాని రీతిలో చూపించాడు. సైనికుడు సినిమాలో స్టూడెంట్లు రాజకీయాల్లోకి ఎందుకు రావాలో తెలియచెప్పాడు. ‘నేనొక్కడినే’ సినిమాతో ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నా సొంతవారి ఆప్యాయత రుచి ఎరుగని జీవితం దుర్భరం అని తెలియజెప్పాడు. ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక మంచి పాయింట్ తీసుకొని తనకు నచ్చింది.. ప్రజలను మెప్పించేలా చెప్పాలని ప్రయత్నించారు కానీ ఏనాడూ తాను రిస్క్ చేస్తున్నట్లు ఫీల్ అయి సినిమాను కాదనింది లేదుమధ్యలో ఆపింది లేదు.

ఒక పోకిరి లా అల్లరి చేస్తూ బిజినెస్ మ్యాన్ లా క్యాలిక్యులేటెడ్ లైఫ్ కొనసాగిస్తూ ఎంతో దూకుడుతో వెళ్తున్న మహేష్ సామాజిక దృక్పథంతో ఆలోచించే విధానం అతనిని నిజమైనశ్రీమంతుడులా తీర్చిదిద్దింది. అతనికి వచ్చే సబ్జెక్టులు కూడా ఈ మధ్య అలాగే ఉంటున్నాయి. ఎంత సంపాదించినా నలుగురు మనుషులను ప్రేమించడం…. నాలుగు ప్రాణాలను బ్రతికించడమే దైవత్వం అని తెలుసుకోలేని జనాల మధ్య అందరం బ్రతుకుతున్న ఈ రోజుల్లో దాదాపు వెయ్యి మంది చిన్న పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్ చేయించడం అంటే మామూలు విషయం కాదు. ఆ వెయ్యి మందితో ఆగిపోకుండా ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు చేసే పనిలో పడ్డాడు సూపర్ స్టార్ మహేష్. ఇక తను పుట్టిన బుర్రిపాలెం అనే ఒక పల్లెటూరిని దత్తత తీసుకోవడమే కాకుండా ఎప్పుడు ఎవరు సాయం కావాలని అడిగినా నేనున్నాను అంటూ తన అపన్న హస్తం చాపి అందరికంటే ముందు ఉంటాడు మహేష్ బాబు.

Mahesh Babu breaks all records: Read for details | IWMBuzz

రాజకుమారుడిలా ఇండస్ట్రీలో అడుగు పెట్టి…. ‘మురారిలా పడుచు గుండెల్లో సందడి చేసి టక్కరి దొంగ గా తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన ఈ నాని ఒక్కడిలా వచ్చి తెలుగు సినీ చరిత్రలో తర్వాతి అధ్యాయము రాసేది అతడే అని అందరికీ తెలియజేసి పోకిరీలా ప్రతి కుర్రాడి జీవితంలో భాగమై సైనికుడిలా అభిమానుల ఆశలను కాపాడుతూ…. తెలుగు బాక్స్ ఆఫీస్ కు తన దూకుడును పరిచయం చేసి పాశ్చాత్య దేశాల్లో కూడా మన లెక్కలు నేర్పించిన ఈ బిజినెస్ మ్యాన్ నేనొక్కడినే శ్రీమంతుడు అనిపించుకోవడం కాదని…. ఒక ప్రామిస్ ను మీరకుండా అందరూ బ్రతకాలంటూ ‘భరత్ అనే నన్ను’ చూసి నేర్చుకోండి అంటూ…. ఎన్నో సేవా కార్యక్రమాలతో “దైవోః మనుష్యరూపేనాఅంటూ ఒక మనిషి బయటకు చూపించాల్సిన నిజమైన ఖలేజా ఇది తెలియజెప్పి ఎవరూ అతనికి సరి లేరు అని నిరూపించుకున్న అతనే ఇప్పుడుసర్కారు వారి పాట తో అందరి లెక్కలు తేల్చేందుకు సిద్ధమయిన మన సూపర్ స్టార్ మహేష్ బాబుకి మా ‘న్యూస్ ఆర్బిట్’ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Related posts

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju