NewsOrbit
న్యూస్

సంఘాలందు ఉద్యోగ సంఘాలు వేరయా..! జీతాల తీర్పుపై మెలికలు, మలుపులు..

government employees fire on employees association

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులకు, ఉద్యోగ సంఘాలకు మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఇటివల కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన జీతాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉద్యోగ సంఘాలు చేసిన ప్రకటనే ఇందుకు కారణం. కరోనా సమయంలో ప్రభుత్వం 50 శాతం జీతాలు మాత్రమే చెల్లించింది. మిగిలిన 50 శాతం జీతాలను 12శాతం వడ్డీతో కలిపి చెల్లించాని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ.. ప్రస్తుత సమయంలో ఇంత మొత్తం తమకు వద్దని.. ప్రభుత్వంపై భారం వేయదలచుకోలేదని ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని మరో పిటిషన్ వేస్తామని ఏపీ ఉద్యోగ సంఘం ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతోందని తెలుస్తోంది.

government employees fire on employees association
government employees fire on employees association

ఉద్యోగ సంఘం తమ బాగోగులను చూస్తూ.. తమవైపు నిలబడాల్సింది పోయి ప్రభుత్వం తరపున నిలబడటమేంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేస్తూ తమ జీతాల్లో కోత విధించడమేంటనేది ఉద్యోగుల ప్రశ్న. ముందు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ప్రాముఖ్యతనిచ్చి తర్వాత ప్రజల సంక్షేమ పథకాల బాధ్యతలు చూడటం ప్రభుత్వ విధి అంటున్నారు. ఇప్పటివరకూ 4 డీఏలు, 2018 నుంచి పే రివిజిన్ రాలేదని.. దీనిపై మాట్లాడని నేతలు కోర్టు తీర్పుతో తమకు రావాల్సిన జీతాలను ఎందుకు పునఃసమీక్షించాలని కోరుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వోద్యోగుల సమస్యలపై సంఘాల నాయకుల వద్ద ప్రస్తావించలేని పరిస్థితులు నెలకొన్నాయని మరికొందరు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు తమకు వర్తించనప్పుడు ప్రభుత్వం నుంచి జీతాలు పూర్తిగా రావాల్సిందేనని అంటున్నారు. కొన్ని శాఖల ఉద్యోగులు పరిస్థితులను లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేసిన ప్రకటన సరికాదని ఉద్యోగులు అంటున్నారు.

Related posts

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N