NewsOrbit
న్యూస్ హెల్త్

విట‌మిన్ సి నిజంగానే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుందా..? ఎలా ప‌నిచేస్తుంది..?

విట‌మిన్ సి.. దీన్నే ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే విట‌మిన్‌. విట‌మిస్ సి లోపిస్తే స్క‌ర్వీ వ్యాధి వ‌స్తుంది. దీని వ‌ల్ల తీవ్ర‌మైన నీర‌సం, అల‌స‌ట‌, ర‌క్త‌హీన‌త‌, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు, గాయాలు త్వ‌ర‌గా మాన‌క‌పోవ‌డం, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలాగే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది. చిగుళ్ల నుంచి ర‌క్తం కారుతుంది. దంత స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే మ‌న శ‌రీరం విట‌మిన్ సి ని త‌యారు చేసుకోలేదు. క‌నుక నిత్యం ఆహారం ద్వారా మ‌న‌కు ఆ విటమిన్ అందేలా చూసుకోవాలి.

does vitamin c really helps building immunity power how it works

విట‌మిన్ సి అనేక ర‌కాల పండ్లు, కూర‌గాయ‌ల్లో మ‌న‌కు ల‌భిస్తుంది. క‌రోనా నేప‌థ్యంలో చాలా మంది త‌మ శరీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు విట‌మిన్ సి ఉన్న ఆహారాల‌తోపాటు మ‌ల్టీ విట‌మిన్ ట్యాబ్లెట్ల‌ను కూడా తీసుకుంటున్నారు. అయితే నిజానికి విట‌మిన్ సి మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. దీని వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. అనారోగ్యాల బారిన ప‌డే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

విట‌మిన్ సి మ‌న శ‌రీరంలో టి-సెల్స్‌ను నిర్మిస్తుంది. వాటి దృఢ‌త్వానికి విట‌మిన్ సి అవ‌స‌రం. ఈ సెల్స్ శరీర క‌ణ‌జాలాన్ని ర‌క్షిస్తాయి. అలాగే శ‌రీరంలోని క‌ణాల‌ను ‌ఆరోగ్య‌క‌రంగా ఉంచేందుకు, ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌కుండా చూసేందుకు విట‌మిన్ సి అవ‌స‌రం. విట‌మిన్ సి మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి క‌ణాల‌ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తుంది. దీని వ‌ల్ల మ‌నం ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డకుండా ఉంటాం. అలాగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు గుర‌య్యే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. విట‌మిన్ సి వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, ఇత‌ర శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. క‌నుక విట‌మిన్ సి ఉండే ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి. దీని వ‌ల్ల క‌రోనా నుంచి కూడా కొంత వ‌ర‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

విట‌మిన్ సి నిత్యం ఎవ‌రెవ‌రికి ఎంత కావాలంటే..
* 0 – 6 నెల‌ల వ‌య‌స్సు – 40 మిల్లీ గ్రాములు
* 7 – 12 నెల‌ల వ‌య‌స్సు – 50 మిల్లీ గ్రాములు
* 1-3 ఏళ్లు – 15 మిల్లీగ్రాములు
* 4-8 ఏళ్లు – 25 మిల్లీగ్రాములు
* 9-13 ఏళ్లు – 45 మిల్లీగ్రాములు
* 14 – 18 ఏళ్లు – పురుషులు 75 మిల్లీగ్రాములు – స్త్రీలు 65 మిల్లీగ్రాములు
* 19 ఏళ్ల‌కు పైబ‌డిన వారు – పురుషులు 90 మిల్లీగ్రాములు – స్త్రీలు 75 మిల్లీగ్రాములు
* గ‌ర్భిణీలు – 85 మిల్లీగ్రాములు
* పాలిచ్చే త‌ల్లులు – 120 మిల్లీగ్రాములు
* పొగ తాగేవారు పైన తెలిపిన మొత్తం క‌న్నా అద‌నంగా మ‌రో 35 మిల్లీగ్రాముల విట‌మిన్ సిని నిత్యం తీసుకోవాలి.

విట‌మిన్ సి మ‌న‌కు ఆరెంజ్‌లు, నిమ్మ‌కాయ‌లు, ఉసిరి, బ‌త్తాయి, గ్రేప్ ఫ్రూట్స్‌, స్ట్రాబెర్రీలు, కివీలు, బ్రొకొలి, బ్ర‌స్సెల్స్ స్ప్రౌట్స్‌, పాల‌కూర‌, కాలే, రెడ్ అండ్ గ్రీన్ పెప్ప‌ర్స్‌, బంగాళాదుంప‌ల్లో ల‌భిస్తుంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N