NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇదిగిదిగో వీర్రాజు లెక్కలు బయటికి వచ్చేశాయి..! చరిత్ర అంతా విప్పుతున్నాడు….

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత దూకుడే మంత్రంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో విపక్ష పార్టీ అయినా టిడీపి బాగా బలహీన పడిపోవడంతో బిజెపికి వచ్చే ఎన్నికల్లో చక్రం తిప్పడానికి మంచి ఛాన్స్ లు ఉన్నాయన్నది అన్నది మొదటి నుండి సోము వీర్రాజు వాదన. మరి 2024 ఎన్నికల సమయానికి బిజెపి బాగా పుంజుకోవాలి అంటే వారికంటూ ఎంత ఓటు బ్యాంకు ఉందో ఒక అంచనాకు రావాలి. అందుకు సంబంధించి కమలనాథులు ఇప్పుడే లెక్కలు మొదలుపెట్టారు…. ఎన్నో అంచనాలతో ముందుకు దూసుకెళ్తున్నారు.. కానీ అవే మనకి ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి.

విషయం ఏమిటంటే…. వీర్రాజు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కి వచ్చిన ఓట్లు…. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన కు పడిన ఓట్లు బిజెపికి మళ్ళుతాయని అంచనా వేశాడు. వీర్రాజు లెక్కల ప్రకారం 2009 ఎన్నికల బరిలో నిలిచిన ప్రజారాజ్యం పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో అవన్నీ అటూ ఇటుగా బిజెపి కే అట. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి అయినా కూడా… అదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ సైతం 18 శాతం ఓట్లు పడిన విషయాన్ని వీర్రాజు గుర్తుచేసుకున్నాడు. 1998లో వాజ్ పయి నేతృత్వంలోని బిజెపి 18 శాతం ఓట్లతో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న విషయాన్ని కూడా గుర్తు చేశాడు.

ఇక మొన్నటి ఎన్నికల్లో పవన్ పెద్దగా ప్రభావం చూపే అవకాశం దక్కలేదు. అయితే ఆ పార్టీకి దక్కిన ఏడు శాతం ఓట్లు కూడా బిజెపి ఖాతాలోనే పడిపోతున్నాయి. మొత్తానికి ఇలా బిజెపికి ఓట్ల శాతం 18+7=25% ఓట్లను వీర్రాజు అంచన్నా వేస్తున్నాడు. అయినా అధికారపక్షమైనా…. విపక్షమైనా కాకుండా మధ్యేమార్గంగా ఉన్న పార్టీలకు ఓట్లు చాలా తక్కువగా ఉంటాయి. ప్రజారాజ్యం సందర్భంగా చిరు మేనియా పీక్స్ లో ఉంది. అయితే రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వంటి అగ్ర నేతలను ఎదుర్కొని 18 సీట్లు సాధించడం అంటే చిన్న విషయం కాదు.

మరి వీర్రాజు లో పార్టీలో అంతటి నాయకుడు ఎవరు ఉన్నారు…? అదీ ప్రజలు 25 శాతం ఓట్లు కుమ్మరించేందుకు అని పలువురి ప్రశ్న. అన్నదమ్ముల పార్టీలకు వచ్చిన ఓట్లు తమకు వస్తాయని వీర్రాజు వాదన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాజకీయ పార్టీగా అధికారపక్షం పనులను ఎండగట్టడం, విపక్షం విధానాలను వ్యతిరేకించడం చేసి ఆయా పార్టీల వల్ల లాభం లేదు అని తేల్చేసి మధ్యే మార్గంగా ఉన్న తమ పార్టీల వైపు ప్రజలు మొగ్గు చూపేలా చెసుకోవాల్సింది పోయి ఖాళీగా కూర్చున్నా ఇన్ని శాతం ఓట్లు మాకు వస్తాయి… మేము సేఫ్ జోన్ లో ఉన్నాము అంటూ పవన్ పైన, చిరు పైన ఆధారపడడం ఎంతవరకు సమంజసం? మరి వీర్రాజు లెక్కల బుక్కు లో ఇలాంతి లాజిక్స్ కి చోటు లేదేమో.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju