NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

వైసిపికా..,బిజేపికా…? గంటా వెనుక ఇంత స్కెచ్ ఉందా..?

విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఉత్తరాంధ్రలో కీలక నాయకుడు గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రయాణం వైసిపితోనా లేక బిజెపితోనా అన్న సందేహాలు మొదలు అయ్యాయి. గంటా రాజకీయంపై ఇప్పటికే రాష్ట్రంలో కధలు కధలుగా చెప్పుకుంటున్నారు. అదుగో పులి అంటే ఇదో తోక అన్న చందంగా గంటా శ్రీనివాసరావు వైసిపిలో చేరుతున్నారు. చేరిక ఖాయం అయ్యింది.

Ganta srinivasarao

ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 16వ తేదీ వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు అంటూ ఈ నెల మొదటి వారం నుండి విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇటు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్టీమ్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వార్తలు, కథనాలు కూడా వచ్చాయి. అయితే వైసిపిలో చేరిక విషయంపై ఆయన ఎక్కడా చెప్పడం గానీ, వైసిపి నుండి ఎక్కడా దృవీకరించినట్లు గానీ జరగలేదు. గంటా శ్రీనివాసరావు వైసిపిలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారా అంటే కశ్చితంగా చేస్తున్నారు. అందుకు సాక్షం ఆ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలే.

పూర్వాశ్రమంలో గంటాకు మంచి స్నేహితుడు, నేడు రాజకీయ ప్రత్యర్థి, విరోధి అయిన మంత్రి అవంతి శ్రీనివాస్ యే గంటా వైసిపిలో చేరికను వ్యతిరేకిస్తున్నారు. అవంతి శ్రీనివాస్ రెండు మూడు సార్లు గంటా శ్రీనివాసరావు చేరికపై పరోక్షంగా మాట్లాడారు. ఆయనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి, ఆయన అవినీతి మరకను కప్పి పుచ్చుకోవడానికి మా పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సాక్షత్తు ఆ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ యే ఈ వ్యాఖ్యలు చేయడంతో గంటా శ్రీనివాసరావు వైసిపిలో చేరుతున్నారని అందరూ నమ్మారు. కానీ ఇప్పటికీ గంటా శ్రీనివాసరావు వైసిపి తీర్థం పుచ్చుకోలేదు. గంటా శ్రీనివాసరావు వైసిపిలో చేరకపోవడానిికి కారణం ఏమిటి, అంతర్గతంగా ఏమి జరుగుతుంది అని ఆరా తీస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుస్తున్నాయి.

ఇప్పుడు గంటా రాజకీయ వ్యవహార శైలి పరిశీలిస్తే ఆయన మొదటి నుండి ఏ రాజకీయ పార్టీలోనూ, ఏ నియోజకవర్గంలోనూ కుదురుగా పది కాలాల పాటు ఉన్నవ్యక్తి కాదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరడం, మంత్రి పదవిని అధిష్టించి అధికారాన్ని చెలాయించడం ఆయన నైజం. తాను ఎక్కడైతే గెలుస్తానని భావిస్తారో అ నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడి నుండి పోటీ చేయడం గంటా రివాజు. రాజకీయాలలో రెండు మూడు రకాల మనస్థత్వాలు ఉన్న నాయకులు ఉంటారు. ఏదైతే నియోజకవర్గంలో అయితే పోటీ చేస్తారో అక్కడ గెలిచినా ఓడినా అదే నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని ఉంటూ కార్యకర్తలు, ప్రజలు, ఓటర్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే వారు ఒక రకం అయితే నియోజకవర్గం ఏదైనా ఫరవాలేదు, తాను గెలవడమే ప్రధానం, అధికారమే తమ లక్ష్యం అంటూ సేఫ్ జోన్ రాజకీయం చేసే వారు మరో రకం. దీనిలో గంటా చేసేదే సేఫ్ జోన్ రాజకీయం.

ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. టిడిపి ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు గంటా ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. గత టిడిపి హయాంలో ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఉన్నారు. అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం జగన్మోహనరెడ్డి సర్కార్ గత టిడిపి హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు తవ్వి బయటకు తీస్తూ కేసులు నమోదు చేస్తూ మాజీ మంత్రులను శ్రీకృష్ణ జన్మస్థానాలకు పంపే పనిలో ఉంది. దీంతో గంటా అధికార పార్టీలో చేరాలని భావిస్తున్నారు అనేది అధికార పార్టీ నాయకుల వాదన. గంటా శ్రీనివారరావు వైసిపి కాకుండా బిజెపిలో చేరినా సేఫ్ జోన్ లో ఉన్నట్లే లెక్క. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఆ పార్టీలో చేరినా కొంత వరకూ కేసుల నుండి, గత అవినీతి వ్యవహారాలు బయటకు రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. వైసిపిలో ఆయన చేరాలనుకుంటుంది రాజకీయ దర్పం, హోదా, పెత్తనం కోసం. ప్రస్తుత పరిస్థితిలో ఆ పార్టీలో ఆయనకు అవి లభించే అవకాశాలు లేవు. ఎందుకంటే గంటా చేరికను మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో కాంగ్రేస్ ప్రభుత్వ హయాంలో ఆ తరువాత టిడిపి ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన మాదిరిగా ఇప్పుడు వైసిపి ప్రభుత్వంలోనూ గంటా చక్రం తిప్పాలనుకుంటే సాధ్యపడే ప్రసక్తి ప్రస్తుతం లేదు. దీనితో అధికార వైసిపిలో చేరాలా, లేక బిజెపి లో చేరాలా అన్న మీమాంసలో గంటా ఉన్నట్లు తెలుస్తోంది.

నిజానికి గంటా శ్రీనివాసరావు నూరు శాతం వైసిపిలో చేరనున్నారు అన్న తరుణంలో స్థానిక మంత్రి అవంతి, ఎంపి విజయసాయి రెడ్డి నుండి వ్యతిరేకత వ్యక్తం కావడంతో కొంత వెనుకడుగు వేశారు అన్న మాట వినిపిస్తుంది. ఇప్పుడు గంటాతో బిజెపి నాయకులు చర్చలు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ప్రస్తుతం బిజెపిలో గంటా సామాజిక వర్గానికి చెందిన నాయకుల హావా నడుస్తున్నది. ఈ సామాజిక వర్గ ఆసరాతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా మార్చాలని బిజెపి యోచిస్తోంది. గంటా శ్రీనివాసరావు ఇద్దరు వియ్యంకులు కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న వాళ్లే, ఒకరు మాజీ మంత్రి నారాయణ కాగా, మరొకరు భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. వీరు ముగ్గురు పార్టీలో చేరితే బిజెపి ఆయా ప్రాంతాల్లో మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. గంటా శ్రీనివాసరావు ఇటు అధికార వైసిపిలో గానీ అటు బిజెపిలో గానీ చేరే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఏ పార్టీలో చేరనున్నారు అనేది ప్రస్తుస్థానికి సస్పెన్స్ అయినా తెలుగుదేశం పార్టీలో కొనసాగే అవకాశం లేదు అన్నది తేలిపోతున్నది. గంటా రాజకీయ సస్పెన్స్ వీడటానికి మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju