NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

టీడీపీ – కాంగ్రెస్ పార్టీకి… 23 కీ లింకేంటి..??

 

చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీకి, సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య ఒక అంకెతోనూ లింగ్ ఏర్పడింది. అదేంటి చంద్రబాబుకు, కాంగ్రెస్ పార్టీకి గతం నుండి లింక్ ఉంది కదా ఇప్పుడు కొత్తగా లింకేంటి అనుకుంటున్నారా అదీ తెలుసుకుందాం. గడచిన ఎన్నికలకు ముందు ఎన్ డి ఎ నుండి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మోదీపై పెద్ద యుద్ధమే చేసిన విషయం తెలిసిందే కదా. జాతీయ స్థాయిలో మోది హవా తగ్గిపోయిందని, కేంద్రంలో ఇక రాబోయేది కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వమేనని తాను ఇక జాతీయ స్థాయిలో చక్రం తిప్పవచ్చు అనుకుంటూ చంద్రబాబు నాడు రాహుల్ గాంధీతో చెెట్టాపట్టాుల వేసుకొని తిరిగారు కదా.

 

ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో బిజెపికి వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. అయితే వారి అంచనాలు తల్లకిందులు అయ్యాయి. 2019 ఎన్నికల్లో మోడి నేతృత్వంలోని బిజెపి అఖండ మెజార్టీతో విజయం సాధించింది. రాహుల్ నాయకత్వం వహించిన కాంగ్రెసే్ పార్టీ జాతీయ స్థాయిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. దానికి నైతిక బాధ్యత గానో, మనస్థాపానికి గురయ్యో రాహుల్ తన పదవి ని త్యజించారు. నాడు రాహుల్ తో చెట్టాపట్టాలు వెసుకొని తిరిగిన చంద్రబాబు పార్టీ తెలుగుదేశం కూడా ఇక్కడ రాష్ట్రంలో ఘోర పరాజయం చవి చూసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 23 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే గుడ్డిలో మెల్ల అన్న సామెత మాదిరిగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించులేకపోగా ఇక్కడ మాత్రం బొటాబొటి సీట్లతో ప్రతిపక్ష హోదాను మాత్రం టిడిపి దక్కించుకున్నది. ఇది కొంత వరకు వారికి సంతోషించదగిన విషయం. ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి టిడిపి కొంత దూరం జరిగినట్లే ఉందనుకోండి.

ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం…రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. అది అందరూ అనుకుంటున్నదే. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజాిరిపోతుండటంతో ఆ పార్టీ సీనియర్ తీవ్ర కలత చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. ఓ 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు సోనియాకు లేఖ రాశారు. అయితే ఇది యాదృశ్చికంగా 23 మంది కలిసి లేఖ రాసినప్పటికీ…ఎపిలో టిడిపి వచ్చింది కూడా 23 స్థాానాలే కావడంతో ఈ అంకె విషయంలో టిడిపి, కాంగ్రెస్ లింక్ కలిసింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి మాదిరిగానే ఇక్కడ టీడీపీ పరిస్థితి ఉండటం, కూడబలుక్కున్నట్లు 23 మందే కాంగ్రెస్ సీనియర్ లు సోనియాకు లేఖ రావడం గమనార్హం. కాంగ్రెస్ నేతల ఈ చర్య రాహుల్ గాంధీకి ఆగ్రహం తెప్పించడం, ఆ తరువాత ఆయన సీనియర్ పై నిప్పులు చెరగడం, అదే స్థాయిలో సీనియర్ లు ధీటుగా సమాధానాలు ఇవ్వడం తరువాత టీ కప్పులో తుఫాను మాదిరిగా వారంతా సర్దుకోవడం తెలిసిందే కదా.

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?