NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్ మీద విప‌రీతంగా ఫైర్ అవుతున్న హైద‌రాబాదీలు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విష‌యంలో ప్ర‌త్య‌ర్థి పార్టీల ప్ర‌చారాన్ని టీఆర్ఎస్ పార్టీ నేత‌లు తిప్పికొడుతున్న‌ప్ప‌టికీ… ప్ర‌జ‌ల్లో ఊహించ‌ని రీతిలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

కొన్ని విష‌యాల్లో కేసీఆర్ వైఖ‌రి ఆయ‌న‌కే ఇర‌కాటంగా మారుతోంద‌ని అంటున్నారు. తాజాగా మొహ‌ర్రం జ‌రిగిన తీరు విష‌యంలో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.

కోర్టు ఏం చెప్పింది?

మొహ‌ర్రం ర్యాలీల విష‌యంలో ఉత్కంఠ చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్టు 30న హైదరాబాదులోని పాతబస్తీ డబీర్ పురా బీబీకా అలావా నుంచి చాదర్ ఘాట్ వరకు మొహర్రం ఊరేగింపుకు అనుమతించేలా పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఊరేగింపుకు తాము అనుమతిని ఇవ్వలేమని చెప్పింది. మొహర్రం ఊరేగింపుకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక పిటిషన్ నిరాకరించిందని పేర్కొంటూ తాము కూడా పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. అదే విధంగా కరోనా వ్యాప్తి క్రమంలో కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఊరేగింపులపై నిషేధం కొనసాగుతోందని చెప్పింది.

హైద‌రాబాద్‌లో ఏం జ‌రిగింది?

అయితే, మొహర్రం సందర్భంగా ఆదివారం రోజున పాతబస్తీలో బీబీకా అలం ర్యాలీని నిర్వహించారు. మొహర్రం ర్యాలీకి పరిమితి, షరతులతో కూడిన అనుమతిని పోలీసులు ఇచ్చారు. అయితే, పోలీసుల హెచ్చరికలు పాటించకుండా, కరోనా నిబంధనలు పాటించకుండా నిర్వాహకులు ర్యాలీని నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీలో వేల సంఖ్యలో షియాలు పాల్గొన్నారు. అయితే, ఈ ర్యాలీలో కరోనా, లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా ర్యాలీ నిర్వహించారు. దీంతో పోలీసులు పాతబస్తీలోని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు.

కేసీఆర్ ‌…బుక్క‌వుతున్నారా?

అయితే ఈ ప‌రిణామాల‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. సోమవారం ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యలో హిందూ సమాజం ఇబ్బందులు పడుతోందన్నారు. కోవిడ్ ను అడ్డంపెట్టుకొని బోనాలు, ఉగాది, శ్రీరామ నవమి, గణేశ్ పండుగలు చేసుకోనివ్వలేదని సంజ‌య్‌ ఆరోపించారు. గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తోందన్నారు. అదే స‌మ‌యంలో ఆదివారం పాతబస్తీలో జరిగిన మొహరం ర్యాలీని ఎందుకు అడ్డుకోలేదని ంబ‌డి సంజ‌య్‌ ప్రశ్నించారు. గణేష్ నవరాత్రులకు లేని పర్మిషన్ మొహరంకు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. పోలీసులే దగ్గరుండి.. వేల మందితో ర్యాలీ నిర్వహించారని, హిందువులు గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క వర్గానికే కొమ్ము కాస్తోందని, ఎంఐఎం ప్రతినిధిగా హోంమంత్రి వ్యవహరిస్తున్నారని బండి‌ సంజయ్ తప్పుబట్టారు. హిందూ సమాజానికి సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ డిమాండ్ చేశారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju