NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

టీకా రాదు..! తిక్క తిక్క ప్రకటనలొద్దు..!!

 

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో కరోనా మహామ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. కరోనా వైరస్ నిర్మూలనకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. కరోనా వ్యాక్సిన్ పై వివిధ దేశాలు, ఫార్మా కంపెనీలు అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుందంటూ తిక్కతిక్క ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఒ) ఇప్పట్లో టీకా రాదు అంటూ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచంలోని అన్ని దేశాలు ఏంతో ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక్క సారిగా పెద్ద బాంబు పేల్చింది. ఇప్పట్లో కరోనా వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేదని చెప్పి ప్రపంచ దేశాలను ఒక్క సారిగా ఖంగుతినేలా చేసింది. అమెరికాలో కరోనా వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయిల్స్ ఇంకా పూర్తి కాలేదు. కానీ నవంబర్ ఒకటి నాటికి వ్యాక్సిన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలంటూ అక్కడి రాష్ట్రాల గవర్నర్ లకు ఆదేశాలు జారీ చేసింది అమెరికా ప్రభుత్వం. మరో వైపు రష్యా కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది అంటూ ప్రకటనలు ఇచ్చేసింది. మరి కొన్ని వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు మరి కొద్ది నెలల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందంటూ భిన్నమైన ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇవన్నీ గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ పై కీలక ప్రకటన చేసింది. కరోనాను అరికట్టే వ్యాక్సిన్ ఇప్పట్లో రాదనీ, వచ్చే ఏడాది మధ్య కాలం నాటికి అంటే దాదాపు పది నెలలకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని డబ్ల్యుహెచ్ఒ అధికార ప్రతినిధి మార్గరేట్ హ్యారిస్ ప్రకటించారు. శుక్రవారం సంస్థ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న సంస్థలు వాటి ప్రభావం ఏ మేరకు చూపుతాయో చెప్పలేదని పేర్కొన్నారు. వ్యాక్సిన్ కొరకు వచ్చే ఏదాది మధ్య కాలం వరకూ వేచి చూడాల్సిందేనని తెలిపింది.

వ్యాక్సిన్ తయారీలో మూడవ దశ క్లినికల్ ట్రయిల్స్ అత్యంత కీలకమని మార్గరేట్ హ్యారిస్ అన్నారు. దీనికి ఎంత సమయం పడుతుందో స్పష్టం చెప్పలేమని పేర్కొన్నారు. అగ్రరాజ్యం అమెరికా దేశం నుండి కరోనా వ్యాక్సిన్ పై ఆశలు చిగురిస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అందుకు వ్యతిరేకంగా ప్రకటన జారీ చేయడం ప్రపంచంలోని ప్రజానీకాన్ని తీవ్ర ఆందోళనకు, గందరగోళానికి గురి చేస్తున్నది. త్వరగా వ్యాక్సిన్ వ్యాక్సిన్ వస్తుంది, ఈ ఇబ్బందులు తొలగిపోతాయని అనుకుంటున్న ప్రజానీకం ఆశలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఒ) నీళ్లు పోసినట్లు అయ్యింది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?