NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఇద్దరు సిఎంల ‘ప్రైవేటు’ పరం..! వరమా..?శాపమా..??

 

(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె చందరశేఖరరావు (కెసిఆర్) మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ గెలుపునకు పరోక్షంగా కెసిఆర్ కూడా సహకరించారని పేరున్నది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆంధ్రా అంటేనే అగ్గిలం మీద గుగ్గిలం అయ్యే కెసిఆర్.. ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డికి అన్ని విధాలుగా తోడ్పాటు అందించడంతో పాటు జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారానికి సైతం వచ్చి అభినందనలు తెలిపి ఆతిథ్యం స్వీకరించి వెళ్లారు. ఆ తరువాత ఆంధ్రా – తెలంగాణ భాయ్ భాయ్ అన్నట్లుగా    ఎన్నికల ముందు నుండి ఉన్న సన్నిహిత సంబంధాలను కెసిఆర్, జగన్ కొనసాగిస్తూనే వస్తున్నారు. ఈ సన్నిహిత సంబంధాల కారణంగా జగన్మోహనరెడ్డి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పలు భవనాలను బేషరతుగా వాళ్ళకు అప్పగించేశారు. కెసిఆర్, జగన్‌లకు మధ్య గురు శిష్యుల బంధం ఉందంటూ ప్రచారం జరిగింది.

KCR-YS-Jagan

ఇద్దరి మధ్య ఇంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ పలు కీలక అంశాల అంశాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య వివాదాలు పరిష్కారం కావడం లేదు. కృష్ణా జలాల అంశంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు కృష్ణా రివర్ బోర్డుకు, కేంద్రానికి ఫిర్యాదు చేసుకునే వరకూ వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసి టెండర్లు ఆహ్వానించడంతో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం రాజుకున్నది. కోర్టులో సైతం పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ సమస్య ఇలా ఉండగానే మరో సమస్య వచ్చి పడింది.

కరోనా లాక్ డౌన్ ప్రారంభం నుండి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్ టి సి బస్సు సర్వీసుల రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం అంతర రాష్ట్రాల మధ్య ప్రజా రవాణాపై ఉన్న నిషేదాన్ని తొలగించింది. దీంతో గతంలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ మధ్య ఆర్ టి సి బస్సు సర్వీసుల పునరుద్ధరణ జరుగుతుందని అందరూ భావించారు. మూడు  రోజుల క్రితం రాష్ట్ర మంత్రులు పేర్ని నాని హైదరాబాదుకు బస్సు సర్వీసు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన  సిఎం జగన్ హైదరాబాదుకు బస్సు సర్వీసులు నడపాలని అధికారులను ఆదేశించారు.అయినప్పటికీ బస్సు సర్వీసుల పునరుద్ధరణ జరగలేదు.

దీనికి కారణం ఏమిటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల మధ్య కిలో మీటర్ల పంచాయతీ నెలకొని ఉండటంతో ఏపిఎస్ ఆర్ టి సి హైదరాబాదు బస్సు సర్వీసులు నడపడానికి సిద్ధంగా ఉన్నా టీఎస్ ఆర్ టి సి మోకాలడ్డింది. విషయం ఏమిటంటే ఏపిఎస్ ఆర్‌టీసీ బస్సులు తెలంగాణలో 2.60 లక్షల కిలో మీటర్ల మేర నడుస్తుండగా టీఎస్ ఆర్ టి సి బస్సులు ఆంధ్రప్రదేశ్ లక్షా 60వేల కిలో మీటర్ల మేర మాత్రమే తిరుగుతున్నాయి. ఏపి నడుపుతున్న 2.60 లక్షల కిలో మీటర్లలో లక్ష కిలో మీటర్లు తగ్గించుకుంటే తాము ఆంధ్రా ఆర్ టిసి బస్సులకు అంగీకరిస్తామని  టిఆర్ ఆర్‌టిసి స్పష్టం చేసింది. దీనిపై ఎపి ఎస్ఆర్‌టి యాజమాన్యం తాము 50వేల కిలో మీటర్లు తగ్గించుకుంటామనీ, ఆ మేరకు టిఆర్ ఆర్‌టిసి కూడా కిలో మీటర్లను పెంచుకోవాలని ప్రతిపాదించింది. దీనికి టిఎస్ ఆర్‌టిసి అంగీకరించలేదు.ఇరు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల మధ్య నెలకొన్న ఈ కిలో మీటర్ల పంచాయతీ ప్రైవేటు బస్సు ఆపరేటర్‌లకు వరంగా మారుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య ప్రైవేటు బస్సు యాజమాన్యాలు టికెట్ బుకింగ్ రిజర్వేషన్లు ప్రారంభించాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్ టి సి పంచాయతీ ఎప్పటికి పరిష్కారం అవుతుందోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju