NewsOrbit
న్యూస్

భారతీ సమేత జగనే బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు ఇవ్వాలన్న బాబు!

తిరుమలలో డిక్లరేషన్ సమస్య ఒకటి ఇప్పుడు హాట్టాఫిక్ కాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాన్ని మరింత జటిలం చేశారు.అన్య మతస్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు

డిక్లరేషన్ ఇవ్వడం ఆనవాయితీ కాగా ఈ మధ్య టిటిడి అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి అలాంటి డిక్లరేషన్ ఏది అవసరం లేదని ప్రకటించడం తెలిసిందే.ఇది తీవ్రంగా వివాదాస్పదమైంది .హిందూ మతస్థులు టిటిడి చైర్మన్ వైఖరిని తప్పుపడుతున్నారు ఈ వివాదం ఇలా నడుస్తుండగానే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఒక సూచన చేశారు.అది మరో కొత్త వివాదాన్ని రేపి సూచనలు గోచరిస్తున్నాయి.బుధవారం జగన్ తిరుమల పర్యటనకు వెళుతుండగా చంద్రబాబునాయుడు ఆగమేఘాల మీద చిత్తూరు జిల్లా టిడిపి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ఒకటి పెట్టారు.ఇందులో ఆయన మాట్లాడుతూ జగన్ తప్పనిసరిగా తిరుమల ఆలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఇవ్వాలని సూచించారు.డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారి ఆలయంలోకి అడుగు పెట్టాలని కోరారు.

Jagan's Tirumala Darshan controversy: Did not sign TTD declaration, yet  again

అన్యమతస్థుడైన దేశాధ్యక్షుడే డిక్లరేషన్ఇచ్చారని.. అలాంటిది ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇస్తే తప్పేముందని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు ఇంకో సూచన కూడా చేశారు. బ్రహ్మోత్సవాల వేళ స్వామి వారికి పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి ఒక్కరే కాకుండా సతీ సమేతంగా ఇవ్వాలని బాబు మెలికపెట్టారు.బ్రహ్మోత్సవాల్లో ఒంటరిగా పట్టువస్త్రాలు ఇస్తే జగన్ తో పాటు.. రాష్ట్రానికి కూడా అరిష్టమని చెప్పిన చంద్రబాబు వాటిని సీఎం దంపతులు కలిసి ఇవ్వాలన్నారు. ఇది శతాబ్దాల తరబడి సాగుతున్న ఆచారమని చంద్రబాబు గుర్తు చేశారు.అన్యమత ఆచారాల్ని కించపర్చరాదని.. ఇతర మతాలను చులకన చేయరాదన్న ఆయన చట్టపరంగా ఎన్నికైన ముఖ్యమంత్రి చట్ట ఉల్లంఘన చేయటం సరికాదన్నారు.ఇప్పటివరకు డిక్లరేషన్ ఇష్యూ ఒకటి హాట్ టాపిక్ గా మారిన వేళ..

స్వామివారికి పట్టువస్త్రాల్ని సమర్పించే విషయంలో దంపతులు ఇద్దరు ఉండాలన్న సంప్రదాయాన్ని బాబు గుర్తు చేయటంతో మరో అంశం తెర మీదకు వచ్చినట్లైంది. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తే ఆయనకే నష్టం జరిగే అవకాశం ఉంది. ఒకవిధంగా చంద్రబాబునాయుడు మతమనే తేనెతుట్టెను తనదైన శైలిలో కదిలించారు. దానికి జగన్ ఎలా స్పందిస్తారు అన్నది వేచి చూడాలి .

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju