NewsOrbit
న్యూస్

‘ ఆ కండిషన్ లకి ఒప్పుకుంటేనే పొత్తు కొనసాగింపు ‘ :: పవన్ కి బీజేపీ పెట్టిన టాప్ కండిషన్ ఇదే ?

2019 ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్ట మొదటి సారి ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిపోవడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో కచ్చితంగా ఒక చోట గెలవడం గ్యారెంటీ అని అందరూ భావించారు. కానీ పోటీచేసిన విశాఖ జిల్లా గాజువాకలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రజలు పవన్ కళ్యాణ్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోవడం గ్యారెంటీ అని అందరూ భావించారు. పవన్ ఓడిపోవడంతో ప్రత్యర్థులు కూడా ఇక పాలిటిక్స్ కి ప్యాకప్, సినిమాలకు మేకప్ అన్న తరహాలో సెటైర్లు వేశారు.

BJP became strong in TG after the alliance with JSP? | TeluguBulletin.comఇటువంటి కామెంట్లు వస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ నేరుగా మీడియా ముందుకు వచ్చి నా చివరి కట్టె కాలే వరకు రాజకీయాల్లోకి ఉంటానని మాట ఇచ్చారు. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపిన పవన్  ప్రస్తుతం సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వరుస ప్రాజెక్టులు లైన్ లో పెట్టారు. పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష టిడిపి చాలావరకూ డౌన్ లో ఉండటంతో సోము వీర్రాజు అధ్యక్షతన ఏపీబీజేపీ జగన్ ప్రభుత్వంపై అనేక విషయాలలో పోరాడుతూ ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

 

అయితే ఇప్పటివరకూ ప్రభుత్వంపై బిజెపి చేసిన పోరాటాలలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ నేరుగా పాల్గొన్న సందర్భాలు లేవు. కరోనా వైరస్ వచ్చిన నాటి నుండి చాలా వరకు హైదరాబాదు లోనే పవన్ ఉంటూ వస్తున్నారు. ఏదైనా విషయం గురించి మాట్లాడాల్సి వస్తే సోషల్ మీడియాలో పత్రికా ప్రకటనలు ఇస్తూ రాణిస్తున్నారు. దీంతో ఈ విషయం బీజేపీ హైకమాండ్ దృష్టి దాక వెళ్ళటం జరిగిందట. మిత్ర పక్షం అయ్యుండి చేస్తున్న పోరాటంలో కలిసి పవన్ ముందుకు రాకపోవటం పై బీజేపీ హైకమాండ్ సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి.

దీంతో పవన్ కళ్యాణ్ కి బీజేపీ హైకమాండ్ కొన్ని కండిషన్లు పెట్టినట్లు దానికి ఒప్పుకుంటేనే పొత్తు కొనసాగింపు ఉంటుందని సరికొత్త షరత్తు ఇటీవల విధించినట్లు టాక్. పవన్ కి బీజేపీ పెట్టిన కండిషన్ లలో టాప్ కండిషన్….బీజేపీ తలపెట్టబోయే ప్రతి ఆందోళన కార్యక్రమం విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలతో పాల్గొనాలని పవన్ కి షరతు విధించినట్లు సమాచారం. పైగా గ్రౌండ్ లెవెల్ లో కూడా జనసేన పార్టీకి సరైన క్యాడర్ లేకపోవడంతో…. ఇక రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ మాట వినకపోతే బిజెపి కూడా పక్కన పెట్టేసే ఆలోచనలో ఉన్నట్లు అంతర్గతంగా రాజకీయ నాయకులలో జరుగుతున్న చర్చ.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju