NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

‘బ్లేమ్స్ ఇండియా’: కుమారస్వామి వ్యాఖ్యలను వక్రీకరించిన టైమ్స్ నౌ!


బెంగళూరు: పుల్వామా ఉగ్ర దాడిపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను టైమ్స్ నౌ ఛానల్ వక్రీకరించిన విధానంపై ‘ఆల్ట్‌న్యూస్’ ప్రతినిధి అర్జున్ సిద్ధార్థ్ ఒక ప్రత్యేక కథనం రాశారు. ఈ కథనంలో కుమారస్వామి ఏమన్నారు? టైమ్స్ నౌ ఏం రాసిందనే విషయాలను వివరించారు.

‘ఉగ్రదాడికి ప్రతీకర చర్యే సమాధానం కాదు. ఇలాంటి ఘటనలకు చోటులేని వాతావరణాన్ని కల్పించాలి. పాకిస్థాన్‌ ఉగ్రదేశంగా మారుతోందా లేదా అన్నది విషయం కాదు. మొదట భారతదేశంలో ఉగ్రవాదాన్ని లేకుండా చేయాలి’ అని కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు.

కుమారస్వామి కన్నడలో చేసిన ఈ వ్యాఖ్యలను టైమ్స్ నౌ ఛానల్ తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేసింది. ‘ఉగ్రవాదం విషయంలో కుమారస్వామి ఇండియాను తప్పుపడుతున్నారు. పాక్ ప్రమేయాన్నిఆయన ఖండించలేదు’ అనే శీర్షికతో టైమ్స్ నౌ కథనాలు ప్రచురితం చేసింది.

https://twitter.com/Waseem_Ahmed11/status/1097785268168314882

ఈ నేపథ్యంలో కుమారస్వామి ఏమన్నారు? మీరేం రాశారు అంటూ టైమ్స్ నౌ కథనంపై సోషల్ మీడియాలో కన్నడ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు కన్నడ రాకుంటే మేమే అనువదించి ఇస్తామంటూ మండిపడ్డారు. ఉగ్రవాదం విషయంలో కుమారస్వామి ఇండియాను తప్పుబట్టలేదని అన్నారు. 40మంది జవాన్లు చనిపోతే బీజేపీ ప్రోపగాండను ప్రచారం చేస్తారా? అని మండిపడ్డారు.

టైమ్స్ నౌ కథనంలో వాస్తవం లేదని ఆదిత్య మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. కన్నడ తెలిసిన వారికి కుమారస్వామి ఏం చెప్పారో స్పష్టంగా అర్థమవుతుంది. కనీసం ఓ కన్నడ అనువాదకుడినైనా నియమించుకోవాలని హితవు పలికారు.

‘పుల్వామా ఉగ్రదాడికి సూత్రధారులైన వారిని మట్టుబెట్టడం మంచి విషయమే. అయితే, మనం 40మంది జవాన్లను కోల్పోయిన తర్వాతే ఈ చర్యకు దిగడంలో ఫలితం లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అది ప్రభుత్వ బాధ్యత. పాకిస్థాన్ ఉగ్రవాద దేశమనడం వేరే విషయం.. కానీ, మనదేశంలో ఉగ్రవాదుల కార్యకలాపాలను లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. తుపాకీతోనే సాధ్యమవుతుందా? లేదా వారిలో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారానా? మన జవాన్లను కోల్పోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలి’ అని కుమారస్వామి వ్యాఖ్యానించారు.

తప్పుగా ప్రచారం చేసిన టైమ్స్ నౌ కథనంపై సీఎం కుమారస్వామి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని అన్నారు. ఉగ్రవాదం విషయంలో తాను ఇండియాను తప్పుబట్టలేదని తెలిపారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడంతోపాటు మనదేశాన్ని బలోపేతం చేసుకోవాలని మాత్రమే తాను సూచించినట్లు వెల్లడించారు.

ఆల్ట్ న్యూస్ సౌజన్యంతో..
– అర్జున్ సిద్ధార్థ్

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Leave a Comment