బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు సండే ఫన్ డే కావడంతో ఇంటి సభ్యులందరినీ నాగార్జున హుషారుగా ఉంచారు. ఇంటి సభ్యులందరితో మంచిగా డమ్ చరాడ్స్ వంటి ఆటలు ఆడిస్తూ మంచి వినోదాన్ని పంచి పెట్టారు. అటు ఆటను సరదాగానే కొనసాగిస్తూ ఎలిమినేషన్ ప్రక్రియను కూడా నింపాదిగా పూర్తిచేశారు.
మరోపక్క అవినాష్ కామెడీ పండిస్తూ నాగార్జునతో కలిసి ముందుకు వెళ్ళాడు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ విషయానికి వస్తే మూడవ కంటెస్టెంట్ ను సేవ్ చేసేందుకు నాగార్జున అందరికీ ఒక పజిల్ ఇచ్చాడు. దానితో అమ్మ రాజశేఖర్, సుజాత, మోనాల్ లకు ఇచ్చిన పజిల్ సెట్ కాకపోవడంతో వారు ఎవరూ సేవ్ కాలేదని చెప్పాడు. లాస్య, అభిజిత్ కి ఇచ్చిన ముక్కలు పజిల్ సెట్ చేయడంతో వారు బ్రతికి పోయాను అని అర్థమైంది.
ఇక ఈ ముగ్గురిలో మోనాల్ సేవ్ అయింది అని చెప్పిన నాగార్జున అమ్మ రాజశేఖర్ సుజాత లను గార్డెన్ ఏరియాలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇక అక్కడ సుజాత పేరు ఎలిమినేట్ అవుతున్నట్లు బయటపడింది.
ఇక ఎప్పటిలాగే నాగార్జున ఇంటిలో ఒకరిపై బిగ్ బాంబ్ వేసే వెసులుబాటుని సుజాతకు కల్పించాడు. ఇంటిలో ఒక వారం పాటు పాత్రలు అన్నీ కడిగే శిక్ష విధించాల్సి ఉంటుంది. ఆ బాంబుని కెప్టెన్ అయిన సోహెల్ పై సుజాత వేసింది. అయితే తాను కెప్టెన్ అని…. ఎటువంటి పని చేయకూడదని సోహెల్ వాదించాడు. కానీ కెప్టెన్సీ ఇమ్యూనిటీ కోసమే కానీ బిగ్ బాంబ్ కోసం కాదని నాగార్జున స్పష్టం చేశాడు.