NewsOrbit
న్యూస్

కాకినాడ వద్ద తీరాన్ని దాటిన తీవ్ర వాయుగుండం..! భారీ వర్షాలతో అతలాకుతలం..!!

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేటి ఉదయం ఏపిలోని విశాఖపట్నం- నర్సాపురం మధ్య కాకినాడకు ఎగువన తీరాన్ని తాకింది. గంటకు 22 కిలో మీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం కొద్దిసేపటి క్రితం తీరం దాటింది. తీరం వెంబడి గంటకు 55 నుండి 75 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తీరం దాటిన తరువాత తీవ్ర వాయుగుండం నుండి వాయుగుండంగా మారి ఆ తర్వాత అప్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.  వాయుగుండం ప్రభావంతో కోస్తా, తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్భ మరఠ్వాడా ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఏపి విపత్తుల శాఖ సూచనల మేరకు రెవెన్యూ అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి తదితర జిల్లాలలో  అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు.

మరో పక్క శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2,47,032 క్యూసెక్కులు వస్తుండగా ఏడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు 2,22,850 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులు ఉంది.

 

Related posts

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N