NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

గోదారిలో అలా.. దుర్గమ్మ దగ్గర ఇలా..!! టైం బ్యాడ్ బాబు..! టైం గుడ్ జగన్..!!

డబ్బు.., హోదా.., కుటుంబం.., కామన్ సెన్స్.. ఈ నాలుగు మనిషి జీవితానికి నాలుగు స్తంభాలు.. .! జీవితాన్ని శాసించేవి, నిలబెట్టేవి ఇవే..! కానీ ఈ నాలుగు స్తంభాలను పునాదిలా నిలబెట్టేది మాత్రం టైం…! అవును టైం బాగుంటే అంతా బాగుంటుంది, టైం బాగోకపోతే ఆలోచనలు బాగోవు, జీవితం బాగోదు..! అందుకే “కాలం కలిసి రావట్లేదు” అంటుంటారు..! ఇక ఈ టైం మన రాష్ట్ర నేతల జీవితంలో బాగా ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం..!!

గోదావరి పుష్కరాల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మొదటి రోజున ఆ సీఎం చంద్రబాబు, కుటుంబంతో సహా పుష్కర స్నానం చేస్తున్నారని లక్షలాది భక్తుల్ని ఆపేసారు. సుమారుగా 45 నిమిషాల పాటూ బాబు కుటుంబం ప్రోటోకాల్ అంటూ ఆపేసారు. ఆయన గారి స్నానం అయ్యాక, భక్తి ముగిశాక.., ఉన్న జనాలను ఒకేసారి వదిలేశారు. ఉన్నపళంగా అందరూ ఒకేసారి హద్దులు దాటుకుని వెళ్లడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు.

ఈ పాపం ఎవరిది..? పుష్కరాల్లో లక్షలాది భక్తుల్ని ఆపేసి స్నానం చేస్తున్న చంద్రబాబుదా..? లక్షలాది భక్తుల్ని మరో ప్రత్యామ్నాయం చూపకుండా వేచి చూసేలా చేసిన అధికారులదా..? ఒకేసారి జనాల్ని వదిలేసి నియంత్రించలేని పోలీసులదా..? త్వరగా పుష్కర స్నానం చేసేయాలని తొక్కిసలాడుకున్న జనాలదా..? దీనికి సమాధానం ఉండదు. ఒక్కటి మాత్రం నిజం. టైం బాలేదు. నాడు బాబుకి, ఆ అధికారులకి, ఆ జనాలకి, ఆ పోలీసులకు టైం బాలేదు. ఉద్దేశ పూర్వకంగా ఎవరూ అలా చేయరు. కొన్ని సమయాల్లో ఊహించని ఉపద్రవాలు ముంచుకొస్తాయి. అలా అది చంద్రబాబుకి బ్యాడ్ టైం గా నిలిచిపోతుంది. ఆయన జీవితకాలం ఈ మచ్చ గుర్తుంటుంది..!!

నిన్న విజయవాడలో కొండచరియలు విరిగిపడ్డాయి. జనాలకు ఎవ్వరికీ ఏం కాలేదు. కొందరు అధికారులకు మాత్రమే పాక్షికంగా గాయాలయ్యాయి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి సీఎం జగన్ అప్పుడే వచ్చారు. సీఎం వస్తున్నారని జనాలను ఆపేసారు. సుమారుగా 50 నిమిషాల పాటు లైన్ కదలనీయలేదు. ఇదే సమయంలో కొండచరియలు విరిగి పడ్డాయి. ఒక వేళ జనాలను వదిలేస్తే.., జగన్ రాకుంటే.., జనాలను నియంత్రించకుంటే ఆ సమయంలో అక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండేది. కానీ.. జగన్ వచ్చారు, పోలీసులు జనాలని ఆపారు.., జనం లేని వేళన కొండా చరియలు కూలాయి. ఒక్క ప్రాణమూ పోలేదు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది గుడ్ టైం కదా..?

నిజమే కదా..! ఇప్పుడు అర్ధమయిందిగా.., టైం ఎలా శాసిస్తుందో. రెండూ ఒకే తరహా సంఘటనలు. సీఎం వచ్చారు, భక్తులు వెయిటింగ్ లో ఉన్నారు. పోలీసులు కాపలా ఉన్నారు. అక్కడ వెయిట్ చేయడం వలన విసిగిన జనం ఒకేసారి తొక్కిసలాటకు గురయ్యారు..! ఇక్కడ వేచి చుసిన జనం కొండ ప్రమాదం నుండి బయటపడ్డారు. చంద్రబాబుకి అప్పుడు టైం బాలేదు. అనేక వేదపండితులు కూడా అదే చెప్పారు. ఇప్పుడు జగన్ టైం నడుస్తుంది. అదే తేడా..!!

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju