NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కిక్కిచ్చిన ద‌స‌రా… కేసీఆర్ స‌ర్కారుకు గొప్ప గుడ్ న్యూస్

తెలంగాణ‌లో ద‌స‌రా పండుగ‌ను ఓ రేంజ్‌లో జ‌రుపుకొంటుంటాయి. అయితే, ఈ పండుగ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. ఓ రేంజ్‌లో ఈ పండుగ‌కు కిక్కు ఎక్కింది.

 

దసరాకు లిక్కర్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి మస్తు ఆదాయం వ‌చ్చింది. పండుగ స‌మ‌యంలో రూ. 406 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి. ఈ నెల 22, 23, 24 తేదీల్లో మద్యం డిపోల నుంచి రూ. 406 కోట్ల విలువైన మద్యాన్ని మందు షాపుల‌కు తరలించారు. ఇంత పెద్ద మొత్తంలో అమ్మ‌కాలు జ‌రిగిన తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ద‌స‌రాకు ఏం జ‌రిగిందంటే….

సాధారణంగా ఒక రోజులో రూ. 70 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు సేల్స్ జరుగుతుంటాయి. అయితే, ద‌స‌రాకే మాత్రం భారీ అమ్మ‌కాలు జ‌రిగాయి. ఈనెల 22న రూ. 131 కోట్లు, 23న రూ. 175 కోట్లు, 24న రూ. 100 కోట్ల లిక్కర్ బయటకొచ్చింది. ఇందులో 4.71 లక్షల కేసుల లిక్కర్, 4.44 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. ఈ లిక్కర్‌ను పండుగ స‌మ‌యంలో సోమవారం అమ్మారు. ఇక ఈ నెలలో 24వ తేదీ వరకు రూ. 1,979 కోట్ల మద్యాన్ని అమ్మారు. గతేడాది ఇదే స‌మ‌యంలో రూ. 1,374 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి.

లాక్ డౌన్ త‌ర్వాత‌

లాక్‌‌డౌన్‌‌ కారణంగా మార్చి 22 నుంచి మే 5 వరకు వైన్స్‌‌ బంద్‌‌ చేశారు. మే 6 నుంచి తిరిగి వైన్స్ ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2211 వైన్స్‌‌లు ఉన్నాయి. లాక్‌డౌన్‌తో వైన్స్ మూసి వేయ‌డంతో రాష్ట్ర ఖజానాకు సుమారు రూ.4వేల కోట్ల వరకు నష్టం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. కరోనా కారణంగా కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి పొందేందుకు ప్రభుత్వం లిక్కర్‌‌పై రేట్లను 20% వరకు పెంచింది. అంతకు ముందు డిసెంబర్‌‌లో కూడా 20% వరకు లిక్కర్‌‌ రేట్లు పెంచింది. గ‌త ఏడాదితో పోలిస్తే ఈ ఐదు నెలల్లో సేల్స్‌‌ తగ్గినా ఆదాయం మాత్రం మస్తు పెరిగింది. మేలో రూ.2,270 కోట్లు, జూన్‌‌లో రూ.2,391 కోట్లు, జులైలో రూ.2,506 కోట్లు, ఆగస్టులో రూ.2,397 కోట్ల లిక్కర్ సేల్ అయ్యింది. ఈ ఐదు నెలల్లో కోటి38 లక్షల 26 వేల 826 కేసుల లిక్కర్‌‌, కోటి 11 లక్షల 6వేల 922 కేసుల బీర్లు సేల్ అయ్యాయి.

సెప్టెంబ‌ర్‌లో ఏం జ‌రిగిందంటే…

సెప్టెంబర్‌‌లో 25 వరకు రూ.1,678 కోట్ల మద్యం సేల్ అయ్యింది. ఇందులో 21 లక్షల కేసుల లిక్కర్‌‌, 16.69 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. ఇదే టైంలో గతేడాది రూ.1130 కోట్ల సేల్స్‌‌ మాత్రమే జరిగాయి. గతేడాది సెప్టెంబర్‌‌తో పోలిస్తే ఈసారి రూ.548.67 కోట్లతో 49.5% అదనంగా ఆదాయం వచ్చింది. ఈ నెలలోనే బీర్ల సేల్స్‌‌ కాస్త పెరిగాయి. కరోనా భయానికి తోడు, బీర్ల రేట్లు పెరగడంతో సేల్స్ తగ్గాయి. ఆగస్టులో బీర్ల గ్రోత్‌‌ రేట్‌‌ మైనస్‌‌ 43% ఉండగా, సెప్టెంబర్‌‌లో మైనస్‌‌ 32 శాతానికి తగ్గింది. ఎక్కువ మంది లిక్కర్‌‌ తాగడానికే ఇంట్రస్ట్‌‌ చూపిస్తున్నారు. ఏపీ సరిహద్దు జిల్లాలైన నల్గొండ జిల్లాలో అధికంగా రూ.151 కోట్లు, ఖమ్మంలో రూ.127 కోట్ల చొప్పున లిక్కర్‌‌ సేల్ అయ్యింది. ఏపీలో లిక్కర్‌‌ రేట్లు ఎక్కువగా ఉండటంతోపాటు లిమిటెడ్‌‌గా అమ్ముతున్నారు. దీంతో అక్కడి వినియోగదారులు ఈ రెండు జిల్లాల్లో ఎక్కువగా కొంటున్నారు.

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!