NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కొత్త జిల్లాల సంఖ్య పై క్లారిటీ వచ్చింది! కోన రఘుపతి చెప్పేశారు!!

రాష్ట్రంలో కొత్త జిల్లాల సంఖ్య విషయంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఏపీ లో ఉన్న ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను లోక్సభ నియోజకవర్గాల ప్రాతిపదికగా 25కు పెంచాలని విధాన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.దీనికి సంబంధించిన కసరత్తు కూడా చాలా వేగంగా జరుగుతోంది.ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీలు ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల వ్యవహారంలో వైసీపీ నేతలెవరూ తలదూర్చవద్దని సీఎం జగన్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

kona raghupathi clarity about new districts
kona raghupathi clarity about new districts

దీంతో ఈ వ్యవహారం గుంభనంగా సాగిపోతోంది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలు ఇరవై అయిదు కాదని ఇరవై ఆరు జిల్లాలు కావచ్చునని కోన రఘుపతి మీడియా సమావేశంలో చెప్పటం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.ఏపీలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినా అరకు నియోజకవర్గం విషయంలో ఏర్పడిన సంక్లిష్టత కారణంగా మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి వస్తోందని కోన రఘుపతి తెలిపారు.వచ్చే ఏడాదిలో ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్‌ వ్యవస్ధీకరణ కోసం నియమించిన కమిటీల నివేదికల ఆధారంగా కొత్త జిల్లాల ప్రకటన ఉంటుందని ఆయన తెలిపారు.వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన ఉండబోతోందని ఆయన వెల్లడించారు. దీంతో ఎన్ని జిల్లాలు ఉండబోతున్నాయనే అంశంపైనా క్లారిటీ వచ్చినట్లయింది.

kona raghupathi clarity about new districts
kona raghupathi clarity about new districts

జిల్లాల సరిహద్దులతో పాటు ఇతర అంశాలపై అధికారులు నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో రఘుపతి వ్యాఖ్యలకి ప్రాధాన్యత లభించింది.జిల్లాల ఏర్పాటు విషయంలో రఘుపతికి పూర్తి అవగాహన ఉంది.ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా గా రూపాంతరం చెందే నేపధ్యంలో రఘుపతి ఈ జిల్లా కిందకు వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల అధికార పార్టీ నేతలతో చర్చలు జరుపుతూ అందరికీ అన్ని విధాలా న్యాయం చేస్తామని చెబుతున్నారు.ముఖ్యంగా చీరాల బాపట్ల లను జంటనగరాలుగా అభివృద్ధి చేసే ప్రతిపాదన కూడా రఘుపతి వద్ద ఉంది.కీలకమైన పదవిలో వున్న రఘుపతి జిల్లాల సంఖ్యను కూడా ప్రకటించడంతో అదే ఖరారు కావొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju